ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంతో సానుకూలంగానే ఉంటున్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు సరైన నిధులు రాబట్టుకోవడానికి ఇప్పటికే కేంద్రం లోని పెద్దలతో పలుమార్లు భేటీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా వరుస భేటీలు అవుతున్నారు.రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోసారి ఢిల్లీకి బయలుదేరారు. కాగా ఈ రోజు రాత్రి 9 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  భేటీ కానున్నారు  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అంతే కాకుండా ఈ రాత్రి ఢిల్లీలోని గడుపుతున్నారు. 

 


 అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు చేయతలపెట్టిన మూడు  రాజధానిల నిర్మాణం సహా.. పలు అంశాలపై చర్చించనున్నారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో పాటు మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని ఈ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక చర్చలు కూడా జరపనున్నట్లు తెలుస్తోంది. 

 

 అయితే ప్రస్తుతం ఢిల్లీ చేరుకున్న జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు రాత్రి 9 గంటలకు హోంశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు రాత్రి ఢిల్లీలోనే గడపనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రేపు మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రవిశంకర్ ప్రసాద్ గజేంద్ర షెకావత్, నిర్మల సీతారామన్ సహా పలువురు మంత్రులను కలవనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మంత్రులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీలో... రాష్ట్రానికి కేటాయించిన నిధులు గురించి  చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: