ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరు విషయంలో గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ నేతల మాటలు విని తమను ఇబ్బంది పెడుతున్నారు అనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు.

 

రాజకీయంగా అండ చూసుకుని అధికార పార్టీ నేతలు తమను కక్ష సాధింపు ధోరణితో పోలీసుల సహకారంతో వేధిస్తున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఎం చేసినా రైట్, తాము ఎం చేసిన తప్పు అన్న చందంగా పోలీసుల వైఖరి ఉందని మండిపడుతున్నారు. 

 

అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి ఈ మధ్య పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఎన్నో విమర్శలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే బూట్లు నాకే పోలీసులను తీసుకొస్తామని అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనిపై పోలీసులు కేసులు కూడా పెట్టారు. అయినా సరే జేసి మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు అనే చెప్పాలి. ఇక ఆయన్ను పోలీస్ స్టేషన్ లో ఉంచి కూడా పోలీసులు వేధించారని టీడీపీ కార్యకర్తలు ఆరోపణలు చేసారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో టీడీపీ నేత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

తాము అధికారంలోకి వస్తే పోలీసులను ఇంటి బయట నిలబెడతామని మాజీ మంత్రి, కేయీ కృష్ణ మూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పోలీసులను తాము వదిలేది లేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏంటో పోలీసులకు చూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేసారు.

 

ఆయనపోలీసుల వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డి మాదిరిగానే వ్యవహరిస్తామని ఆయన స్పష్ట౦ చేసారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి పోలీసులు టీడీపీ నేతల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడంపై ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతుందని అంటున్నారు. పోలీసుల వైఖరి కరెక్ట్ కాదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: