హైదరాబాద్‌లో వాతావరణ కాలుష్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజు రోజుకి పరిశ్రమలు పెరగడం, వాహనాలు పెరగడం, కొత్త వాహనాలు బయటకు రావడం వంటివి జరుగుతున్నాయి. దీనితో కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనితో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఎన్ని విధాలుగా కాలుష్యాన్ని కట్టడి చేద్దామని చూసినా సరే అది సాధ్యం అయ్యే పరిస్థితి ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. దీనిపై తెలంగాణా ప్రభుత్వం ఎన్నో చర్యలు కూడా తీసుకుంటూ వచ్చినా పెరుగుతుంది గాని తగ్గడం లేదు. 

 

ఇక ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ సరికొత్త ఆలోచన చేసినట్టు సమాచారం. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న డీజిల్ వాహనాలను నిషేధించాలని ఆయన భావిస్తున్నారు. దానితో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో దీనికి సంబంధించిన ప్రతిపాదన ప్రస్తావనకు కూడా వచ్చింది. దీనిపై కలెక్టర్లు కూడా తమ అభిప్రాయాలను చెప్పినట్టు తెలుస్తుంది. 

 

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం దెబ్బకు నరకం చూస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం ఆ దరిద్రాన్ని ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఇప్పుడే దానికి సంబంధించిన చర్యలు కఠినంగా ఉండాలని కెసిఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే అధికారులకు కూడా ఆ విధంగా సూచనలు కూడా చేసారని అంటున్నారు. వెంటనే అధికారులు డీజిల్‌ వాహనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని లేకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఈ మేరకు రవాణా శాఖా అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్దం చెయ్యాలని చెప్పినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి. పెట్రోల్‌ వాహనాల కంటే డీజిల్‌ వాహనాలపై 2 శాతం జీవిత పన్ను అదనంగా వసూలు చేస్తున్నారు. 12 ఏళ్ళకు పైబడిన వాహనాలను నిషేధించే యోచనలో ప్రభుత్వం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: