ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం...ఇప్పటివరకు ఉన్న స్పీకర్లు ఒక ఎత్తు అయితే, తమ్మినేని ఒక ఎత్తు. మిగతా అందరి స్పీకర్లకు తమ్మినేని విభిన్నంగా వెళుతుంటారు. ఎప్పుడో టీడీపీలో 1994, 99 ఎన్నికల్లో గెలిచి, అప్పటి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన తమ్మినేని... ఆ తర్వాత నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ హవాలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే సీనియర్ నేత కావడంతో జగన్.....తమ్మినేనికి స్పీకర్ పదవి ఇచ్చారు.

 

ఇక పదవి వచ్చిన కొత్తలో తమ్మినేని అసెంబ్లీని హుందాగా నడిపించారు. అయితే అసెంబ్లీ అయిపోగానే, ఆయనలో మరో కోణం బయటపడింది. తన నియోజకవర్గం ఆముదాలవలసకు వెళ్ళగానే తమ్మినేని ఎమ్మెల్యే పాత్రలోకి వెళ్లారు. చంద్రబాబుని తన మాటల తుటాలతో ఏకీపారేశారు. మళ్ళీ తర్వాత అసెంబ్లీకి రాగానే స్పీకర్ క్యారక్టర్‌లోకి వచ్చి హుందాగా వ్యవహరించారు. అసెంబ్లీ అయిపోతే మళ్ళీ బాబుపై ఫైర్ అవ్వడమే చేశారు. అయితే గత స్పీకర్‌లకు భిన్నంగా తమ్మినేని ఎందుకు వ్యవహరిస్తున్నారనే విషయం గురించి మాట్లాడుకుంటే...స్పీకర్ సొంత జిల్లా శ్రీకాకుళం టీడీపీ నేతలు ఓ కొత్త ట్విస్ట్ చెబుతున్నారు.

 

తమ్మినేనికి స్పీకర్ పదవి కంటే మంత్రి పదవిపైనే మోజు ఉందని, అందుకే ఆయన అసెంబ్లీలో అలా ఉన్న, బయట మాత్రం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని జిల్లా టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఇప్పుడే ఇలా బాబుపై విమర్శలు చేస్తే, మంత్రి వర్గంలోకి వస్తే బాబు ఆట కట్టిస్తానని, తమ్మినేని, జగన్‌కు పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తున్నారట. అందుకే ఇటీవల కూడా అసెంబ్లీలో తన మనసులో మాట కూడా బయటపెట్టారని అంటున్నారు.  స్పీకర్ స్థానంలో ఉండి రాజకీయాలు చేసే బదులు కిందకు వచ్చి మంత్రి అయితే బెటర్ అంటూ అచ్చెన్నాయుడు వెటకారంగానే మాట్లాడగా, ఆగ్రహంగా బదులిచ్చిన తమ్మినేని సీతారాం అలాగే వస్తాను అచ్చెన్నా అంటూ సమాధానమిచ్చారు.

 

ఇక ఇదే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే తమ్మినేనికి మంత్రి అవ్వాలనేది ఓ ట్విస్ట్ అయితే, దానికి చంద్రబాబే పెద్ద దిక్కు అవుతారని, ఆయనపైనే విమర్శలు చేస్తేనే, తమ్మినేని లైన్ క్లియర్ అవుతుందని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: