ఇటీవల ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర పనిచేసి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మానేసిన మాజీ పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస్ చౌదరి వద్ద రెండు వేల కోట్లు ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు దేశ స్థాయిలో సంచలనం నెలకొంది. దీంతో వైసిపి పార్టీ నాయకులు కేవలం పర్సనల్ అసిస్టెంట్ దగ్గర రెండు వేల కోట్లు దొరికితే చంద్రబాబు దగ్గర కొన్ని వేల లక్షల కోట్లు దొరుకుతాయని విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. దీంతో వైసిపి నేతలు చేస్తున్న విమర్శలకు తెలుగుదేశం మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్లు వేయడం స్టార్ట్ చేశారు. ఆయన ఏమన్నారంటే ఎప్పుడో ఎన్నికల ముందు చంద్రబాబు దగ్గర పీఏగా పనిచేసిన వ్యక్తి దగ్గర రెండు వేల కోట్లు దొరికితే దానికి తెలుగుదేశం పార్టీ అంటగట్టడం సిగ్గుచేటు అంటూ వైసీపీ నాయకుల పై సీరియస్ అయ్యారు.

 

అసలు శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తికి మరియు చంద్రబాబు కి సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడారు. అంతే కాకుండా అన్ని వేల కోట్లు ఆ వ్యక్తి దగ్గర దొరికితే తెలుగుదేశం పార్టీపై బురద చల్లడం ఏంటి అంటూ విమర్శలు చేశారు. దీంతో యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ పార్టీ నేతల నుండి కాకుండా సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అవే మాటలు యనమల గారు ఆర్థిక మంత్రిగా మీరు పని చేసి ఇంత దారుణంగా కుట్ర మొత్తం బయటపడితే మీకు అర్థం కావడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

 

మరోపక్క శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తికి మరియు లోకేష్ మధ్య భారీ స్థాయిలో ట్రాన్సక్షన్ డబ్బు లావాదేవీలు జరిగినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇది చాలా పెద్ద కేసు అని కేసు రుజువైతే చంద్రబాబు రాజకీయ చాప్టర్ క్లోజ్ అని రాజకీయ మేధావులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: