రాజకీయం అంటేనే ఆశలు, వలసలు కామన్‌గా ఉంటాయి. ఇందులో పదవులు పొందాలని ఆశించని వారు ఒక్కరు కూడా వుండరు.. అందరికి పదవులే కావాలి. అసలు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చెబుతారే గాని అదంతా ఓ నాటకం అని అతని మనస్సాక్షి అతన్ని అంతర్గతంగా హెచ్చరిస్తూనే ఉంటుంది.. ఈ విషయం అందరికి తెలిసిందే.. ఇకపోతే పదవుల కోసం ప్రాకులాడే నాయకులు, పదవి ఇవ్వకుంటే కనీసం ఆ పార్టీ వైపు కన్నెత్తికూడా చూడరు...

 

 

ఇదిలా ఉండగా గులాభిరంగు పార్టీలో ఇప్పుడు గుసగుసలు మొదలయ్యాయట. ఆ గుసగుసలు కూడా పదవుల కోసమే.. అదేమంటే పదవులు ఆశించి భంగపడుతున్న కొందరు గులాబీ తమ్ముళ్లు నిరాశగా ఉన్నారట.. ఇక ఇప్పటికే  టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో రోజు రోజుకి టెన్షన్ పెరుగుతోందట దీనికి కారణం నామినేటెడ్ పదవులే.. మున్సిపల్ ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులు అయినా కూడా పదవుల విషయంలో క్లారిటీ లేదు. అసలు ఊహించని వారికి పెద్ద పెద్ద పదవులు వస్తుండటంతో నేతల్లో మరింత టెన్షన్ మొదలయింది…

 

 

ఇక తమకు పదవులు వస్తాయా రావా అనే టెన్షన్‌లో, ఇంకా చావని ఆశతో నిత్యం కేసీఆర్, కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారట కొందరు నేతలు.. ఇకపోతే తెలంగాణాలో తొలిసారిగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్లు, కమిషన్లు కలిపి 50 ఛైర్మెన్ పోస్టుల వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. అయితే వీటిలో కమిషన్ల పదవి కాలం మినహా దాదాపు అన్ని కార్పొరేషన్‌ల పదవీ కాలం ముగిసింది.

 

 

అయితే 2018 ఎన్నికలకు ముందు మూడు కార్పొరేషన్‌లకు మాత్రమే వన్ ఇయర్ పాటు ఎక్సటెన్షన్ ఇచ్చారు. అయితే వాటి పదవీ కాలం  ముగిసినా కూడా రెన్యూవల్ విషయంలో గులాబీ బాస్ నోరు మెదపడం లేదట... ఇకపోతే ఆర్టీఐ కమిషన్ పదవుల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలు శంకర్ నాయక్, మహ్మద్ అమీర్‌లకు కూడా పదవులు రావడంతో మిగితా వారిలో టెన్షన్ మొదలయింది. ఇదిలా ఉండగా ఈ పదవులను కొత్త వారికి ఇచ్చే ఆలోచన ఉండటం వల్లే అలస్యం చేస్తున్నారనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది.. మరి ఈ విషయం తేలేది ఎన్నడో అని నాయకులంతా కళ్లల్లో వత్తులేసుకుని మరీ చూస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: