ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 17 నుంచి 45 రోజుల పాటు జనచైతన్య యాత్ర చేయాలని టీడీపీ నేతలు అందరికీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న టిడిపి నేతలు అందరూ జన చైతన్య యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు ఆయా జిల్లాల్లో నేతలకు సూచించారు. టిడిపి ఇన్చార్జి ల నేతృత్వంలో జన చైతన్య యాత్రలు చేపట్టాలంటూ ఆదేశించారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నట్లు  సమాచారం. అయితే వాస్తవానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర వ్యాప్తంగా జనచైతన్య యాత్ర చేపట్టాలని భావించారు. 

 


 కానీ వైయస్సార్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంకా సంవత్సర కాలం కూడా గడవకముందే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లి ఇలా జనచైతన్య యాత్ర చేపట్టడం తప్పుడు సంకేతాలను ఇస్తోంది అనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ప్రజా చైతన్య యాత్రను 45 రోజులపాటు కొనసాగించడం సాధ్యం కాదు అని తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు దగ్గర మొరపెట్టుకున్నట్లు  తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు  ప్రతి అంశంలో ప్రతిపక్ష టిడిపి పార్టీ నిరసన తెలుపుతూ నే ఉంది..

 


 ఈ క్రమంలో 45 రోజుల పాటు పోరాటం చేయాలంటే సాధ్యంకాని పని అంటూ టిడిపి నేతలు చంద్రబాబు దగ్గర మొర  పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో టిడిపి వైసిపి పార్టీ అనే  స్పష్టమైన విభజన ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయి. పండుగలకు ఫ్లెక్సీలు కట్టే విషయంలో... కూడా అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి 45 రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని టిడిపి నేతలు ఆలోచనలో పడ్డాడట. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చైతన్య యాత్ర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: