ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి చంద్రబాబు, లోకేశ్ లపై విరుచుకుపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ చౌదరి ఇంటిపై

ఇటీ దాడుల అంశంపై విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స. వరుసగా ఐదు రోజులపాటు రోజూ జరిగిన ఈ దాడుల్లో రూ. 2000 కోట్లకు సంబంధించిన ఆధారాలు దొరికినట్టు వార్తలు రావడంపై ఆయన స్పందించారు.

 

వరుస దాడుల తర్వాత ఏకంగా రూ. 2000 కోట్ల బండారం బయటపడిందంటూ ఐటీ శాఖే ఓ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇద్దరినీ ఏకేశారు మంత్రి బొత్స. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు ఈ సారి ఆయన ప్రయత్నం మిస్‌ ఫైర్‌ అయ్యిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. పేదల కోసం నిర్మించే ఇళ్లలో కూడా అవినీతికి పాల్పడ్డాడన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

 

ఐటీ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై చంద్రబాబు, లోకేష్‌ ఏం సమాధానం చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బాబు పర్సనల్‌ సెక్రటరీ దగ్గరే రూ.2 వేల కోట్ల అక్రమాస్తులు దొరికాయంటే.. చంద్రబాబు, లోకేష్‌లను విచారిస్తే ఆ రూ.2 వేల కోట్లకు ఇంకెన్ని సున్నాలు చేరనున్నాయో..? అని మంత్రి బొత్స అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవడానికి మీడియా ముందుకు వచ్చి సమగ్ర విచారణ కోరాలన్నారు మంత్రి బొత్స.

 

 

కడిగిన ముత్యం అని చెప్పుకునే లోకేష్‌.. బయటకు రావాలి.. విచారణ జరిగితే ముత్యమో.. మసిబొగ్గో తెలుస్తుందన్నారు మంత్రి బొత్స. పేదవాడి పొట్టకొట్టి దోచుకొని తినడం ఏం బతుకు.. ఇకనైనా చంద్రబాబు రాజకీయాలు విరమించుకుంటే మంచిదని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: