మొన్నటికి మొన్న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది అన్న  విషయం తెలిసిందే. అయితే ఈ  తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరు  ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీ విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. తెలంగాణలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా టిఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో  ఎదురు నిలువలేకపోయింది. ఇకపోతే మున్సిపల్ ఎన్నికల వేడి  తెలంగాణ రాజకీయాల్లో  ఇప్పుడిప్పుడే తగ్గుతున్న  వేల మరోసారి ఎన్నికల సైరన్ మోగింది. 

 


 తెలంగాణ సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ నేడు అనగా ఫిబ్రవరి 15 న జరగనుంది.ఈ  ఎన్నికలను కూడా ఎంతో మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఎంతో మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేసే వారు ప్రచారాన్ని కూడా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సహకార సంఘాల చైర్మన్ల పదవి దక్కించుకోవాలనే కోరిక తో ముందుకు సాగుతున్నారు. దీంతో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో  ఎన్నికల వేడి రాజుకుంది. మొన్నటికి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల అంత లేకున్నా... సహకార సంఘాల ఎన్నికల హడావిడి మాత్రం బాగానే ఉంది. ఇకపోతే దీనికి సంబంధించిన ఎన్నికల పోలింగ్  ఈరోజు జరగనుంది. 

 

 రాష్ట్రంలోని 906 పిఎసిఎస్ లకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ను ప్రారంభించనున్నారు. సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ ఫలితాలు సాయంత్రం వెలువడనున్నాయి. కాగా సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు 747 మందికి గెజిటెడ్  అధికారులను నియమించింది ప్రభుత్వం. కాగా ఈ పోలింగ్లో 20 వేల మందికి పైగా సిబ్బంది పాల్గొననున్నారు. అంతేకాకుండా ఈరోజు జరగబోయే సహకార సంఘాల ఎన్నికల పోలింగ్లో 12 లక్షల మంది తమ ఓట్లను వినియోగించుకోనున్నారు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: