న్యాయవ్యవస్థ ఒకొక్కటి తెరచి చూసే సందర్భంలో ప్రభుత్వం దానికి అనుగుణంగా ఆలోచిస్తూ జాగ్రత్తగా చెయ్యాలి. ఆలా చెయ్యకపోతే వరుస ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం రాజధాని అంశానికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో జరుగుతున్నటువంటి వ్యవహారం. అలాగే ఇతరత్రా అనేక అంశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 

 

దానికి సజీవిమైనటువంటి సాక్ష్యం.. రాజధాని తరిలింపు అంశము.. న్యాయవ్యవస్థకు సంబంధించి విభాగాల తరలింపు వ్యవహారం కావచ్చు.. జాస్తి కృష్ణ కిషోర్ బదిలీ విషయంలో ట్రీభినల్ నుండి ఎదురు తగిలింది.. అలాగే పిపిఎల్ విషయంలో ఎదురు తగిలినటువంటి పరిస్థితులను ప్రతిది కూడా నిర్ణయం ప్రభుత్వం ఒకటి తీసుకుంటే దానికి వ్యతిరేకమైన తీర్పులు వస్తున్నాయి. 

 

చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా తెలుగు మీడియానికి సంబంధించి కూడా ఉండాలి అనేవి అన్ని కూడా జరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా మరో తీర్పు వచ్చింది. మీసేవకు సంబంధించిన తీర్పు వచ్చింది. మీసేవ కేంద్రాలలో సర్టిఫికెట్లు అన్ని ఇస్తుంటారు.. బర్త్ సర్టిఫికెటు, డెత్ సర్టిఫికెట్.. రేషన్ కార్డు ఇలా ఇవి అన్ని కూడా ఇస్తుంటారు. 

 

ఈ సేవలు అన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయం ద్వారా అందిస్తుంది. ఏపీ సెక్రటేరియట్ గ్రామా సచివాలయం ద్వారా అందిస్తుంది. ఇప్పుడు ఆ మీసేవకు సంబంధించిన వారందరు కోరింది ఏంటంటే.. మా పొట్ట కొట్టద్దు.. ఆ సర్టిఫికెట్లు మీరు ఇచ్చేస్తే మాకు ఇంకేం పని ఉండదు.. 15 సంవత్సరాలుగా మేము దానిమీదే ఆధార పడిఉన్నాము. 

 

మమ్మల్ని అందరి ఆ సర్వీసులోకి తీసుకోండి.. మాకు ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని కోరారు. కానీ ప్రభుత్వం అది ఎం పట్టించుకోలేదు.. కొత్తవారికి ఆపాయిట్మెంట్ ఇచ్చేసింది. వీరందరూ హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వం ఏదైతే సర్టిఫికేట్లు ప్రభుత్వమే ఇస్తుంది అని జిఓ జారీ చేసిందో అది రద్దు చేస్తూ మీసేవ వారే ఆ సెర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించింది. 

 

ఈ సందర్భంలో కూడా మీసేవ సిబ్బంది ఏమి ప్రభుత్వ ఘర్షణ పడతి లేదు.. మా బతుకుదెరువు కోసం మేము ప్రయత్నించాము కాబట్టి దయచేసి అర్ధం చేసుకొని మాకు సహకారాణించండి అని అడుగుతుంది. మరి ప్రభుత్వం వారికీ సహకరిస్తే వారికీ అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం.. లేదంటే ఈసేవలకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించడం.. డబ్బులు చెల్లింది వారికీ గ్రామసచివాలయం ద్వారా ఇప్పించుకోవడం. అలా కాకుండా మళ్లీ ఏదైనా ఉత్తర్వులు ఇస్తే వారు ఏమి కోటీశ్వరులు కాదు వారు అందరూ ధనవంతులు కాదు.. వాళ్ళు పొట్టకూటి కోసం ఉద్యోగం చేసుకుంటూ ఈ ఉపాధిని ఎంచుకున్న వారు. వాళ్లకు అది కడుపు కొట్టినట్టే అవుతుంది. ఒకలా కడుపు నింపడం కోసం ఒకలా కడుపు కొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పే వైసీపీ అధికార పార్టీ అలంటి విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది అని రాజకీయ విశ్లేషకులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: