మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ చౌదరి ఇంటిపై

ఇటీ దాడుల అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వరుసగా ఐదు రోజులపాటు రోజూ జరిగిన ఈ దాడుల్లో రూ. 2000 కోట్లకు సంబంధించిన ఆధారాలు దొరికినట్టు వార్తలు వస్తున్నాయి. వరుస దాడుల తర్వాత ఏకంగా రూ. 2000 కోట్ల బండారం బయటపడిందంటూ ఐటీ శాఖే ఓ ప్రకటన చేసింది.

 

అయితే.. ఐటీ దాడులపై చంద్రబాబు, లోకేష్‌ నోరు కూడా మెదపడం లేదు. చంద్రబాబు అండ్ టీమ్ దోపిడీ వెనుక అసలు సూత్రధారి ఒకరు ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆయన ఎవరో తెలుసా..? ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు. చట్టానికి దొరకకుండా ఏ విధంగా దోచుకోవచ్చు అని కుటుంబరావు ప్రణాళికలు సిద్ధం చేసి చంద్రబాబుకు ఇచ్చాడని వైసీపీ ఆరోపిస్తోంది.

 

 

ఇప్పుడు ఆ కుటుంబరావు కూడా ఇప్పుడు మాట్లాడటం లేదని గుర్తు చేస్తోంది. అయితే.. చంద్రబాబు సెక్రటరీ వద్ద రూ.75 లక్షల నగదు, రూ. 80 లక్షల నగలు మాత్రమే దొరికాయని యనమల, అచ్చెన్నాయుడు, బోండా ఉమా మాట్లాడుతున్నారు. అసలు ఈ ఐటీ దాడులకూ టీడీపీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు.

 

 

అయితే వైసీపీ నేతలు మాత్రం దీనికి తెలుగుదేశం పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. దీనికి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ స్కామ్ లెక్కల గుట్టేమిటో ఆదాయపు పన్ను శాఖే విప్పాలి. అప్పటి వరకూ ఏపీలో ఈ విమర్శల వర్షం ఆగేలా లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: