ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈరోజు అకస్మాత్తుగా ఢిల్లీ పయనమైన జగన్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానంగా అమిత్ షా తో సుమారు అరగంట వరకు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ఎందుకు చేస్తున్నాము అనే విషయం పై కారణాలను కూడా జగన్ కు వివరించినట్లు సమాచారం. అలాగే మూడు రాజధానులు ఏర్పాటు అయితే హైకోర్టును  కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయ శాఖ ద్వారా ఆమోదం పొందే విషయంపై  జగన్ చర్చించారు. శాసన మండలి అంశం వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చిందట. 


కొద్ది రోజుల క్రితం మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదించి శాసనమండలిలో ప్రవేశపెట్టగా దానిని చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపడం ఆ తరువాత జగన్ శాసనమండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పైన జగన్ అమిత్ షాకు వివరించినట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో లో రాయలసీమ ప్రాంతంలో హైకోర్ట్  ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని కూడా జగన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబందించిన అనేక విషయాలపై జగన్ అమిత్ షాతో చర్చించారు. 


వెనకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం నిధులు విడుదల కాలేదనే విషయాన్ని వివరించారు. రాజధాని నిర్మాణం కోసం 2500 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు 1000 కోట్లు మాత్రమే ఇచ్చారని, తక్షణమే పెండింగ్ నిధులను విడుదల చేయాలని జగన్ కోరారు. ఇక ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం కడప స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ నిర్మాణానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కూడా జగన్ విజ్ఞప్తి చేశారట. వీటితో పాటు ఇంకా అనేక విషయాల పై జగన్ అమిత్ షా తో చర్చించారు. అన్నింటిపైనా అమిత్ షా సానుకూలంగా స్పంచడంతో జగన్ మరింత ఉత్సాహంగా కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: