ఇటీవల ఐటీ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలలో చేసిన సోదాలు లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర పని చేసిన పిఏ దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. స్వయంగా ఐటి అధికారులు ఈ ప్రకటన చేశారు. చంద్రబాబు దగ్గర ఎలక్షన్ ముందు వరకు పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు అక్రమంగా గుర్తించినట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ వార్త ఏపీ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. మరోపక్క తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వణుకు మొదలైంది. చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దపెద్ద నాయకులు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రావటం లేదు.

 

ఇదే సమయంలో నారా లోకేష్ హుటాహుటిన రాష్ట్రం నుండి హైదరాబాద్ కి పయనమైనట్లు పార్టీ వర్గాల్లో టాక్. ఇదే సమయంలో ఇటువంటి కేసులనుండి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి వాటిపై చర్చించనున్నట్లు సమాచారం. మరోపక్క ఐటీ అధికారులు చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి దగ్గర కమిషన్ల బాగోతాన్ని మొత్తం ఏ విధంగా జరుగుతుందో వాటి బాగోతం మొత్తం లాగినట్లు సమాచారం.

 

అంతేకాకుండా పట్టుబడిన వ్యక్తి దగ్గర 2014 నుండి 2019 వరకు కాంట్రాక్టర్ల కమిషన్ లకు సంబంధించి అన్ని వివరాలు లెక్కలు కలిగిన డైరీలు కూడా ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల నుండి ఒకవేళ కేసు తన పైకి వస్తే ఏ విధంగా తప్పించుకోవాలో వంటి వాటి గురించి లాయర్లతో సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు కి చెందిన ఓ ప్రముఖ రిటైర్డ్ లాయర్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేసులు వాదించే లాయర్ చంద్రబాబుతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్త జాతీయ స్థాయిలో కూడా రావడంతో ఆ లాయర్ చంద్రబాబుతో భేటీ అయ్యారా..? అంటూ జాతీయ స్థాయి నాయకులు చర్చించుకుంటున్నారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: