ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేడు రాజకీయంగా పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. రాజకీయంగా ఆ పార్టీ ఒక రకంగా చుక్కలు చూస్తుంది అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతూనే ఉంది. జగన్ దెబ్బకు ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీలా పడిపోయారు.

 

అమరావతి తరలింపు సహా కొన్ని విషయాలు చంద్రబాబుని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. అదే విధంగా మండలి రద్దు వ్యవహారం కూడా చంద్రబాబుని తీవ్రంగా కలవరపెడుతుంది. తాను ఏ స్థాయిలో పోరాటం చేద్దాం అనుకున్నా సరే జగన్ తనను ఇబ్బంది పెడుతున్నారనే ఆవేదన చంద్రబాబు లో ఉంది. 

 

దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు ఐటి దాడులు పార్టీ నెత్తి మీద గట్టిగానే పడ్డాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రాజకీయంగా ఏదో నిలబడాలని భావించిన చంద్రబాబుకి ఐటి దాడుల ప్రభావం ఆర్ధిక మూలాల మీద గట్టిగానే కొట్టింది.

 

ఇన్నాళ్ళు చంద్రబాబుకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చిన వారు ఇప్పుడు డ్రాప్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది అనేది రాజకీయ పరిశీలకుల మాట. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబుని ఈ దాడులు ఇబ్బంది పెట్టినా అప్పుడు అధికారం ఉంది కాబట్టి సిబిఐ, ఐటిని ఆపించారు. 

 

ఇప్పుడు వాటిని ఆపించే సత్తా కాని, అధికారం గాని చంద్రబాబుకి లేవు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడానికి సిద్దమయ్యారు. ఢిల్లీ వెళ్లి బిజెపిలో తనకు సన్నిహితంగా ఉండే నేతలను కలవాలని బాబు భావిస్తున్నట్టు సమాచార౦.

 

అదే విధంగా తన సన్నిహిత కేంద్ర మంత్రులతో కూడా భేటి అయి పరిస్థితిని వివరించాలని, కుదిరితే ప్రధాని నరేంద్ర మోడీ లేదా హోం మంత్రి అమిత్ షా ని కలిసి పరిస్థితి వివరించి వారిని ఏదొకటి కోరే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆయన గత పది రోజులుగా ఇద్దరి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని టాక్...

మరింత సమాచారం తెలుసుకోండి: