ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 ఎమ్మెల్యే స్థానాలలో, 22 ఎంపీ స్థానాలలో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ముందుగానే సర్వేలు చేయించి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారనే అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇచ్చారని అందువలనే వైసీపీ 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని వార్తలు వినిపించాయి. ఏపీలో అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. 
 
ఇప్పటికే వైసీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి అనుచరులకు టికెట్లు ఇప్పించుకుందామని ప్లాన్ చేయగా సీఎం జగన్ వారికి ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో పార్టీనే నిర్ణయిస్తుందని పార్టీ నిర్ణయమే తుది నిర్ణయం అని స్పష్టం చేశారని సమాచారం. సీఎం జగన్ నిర్ణయంతో వైసీపి నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. 
 
వైసీపీ ప్రభుత్వం మార్చి నెల 15వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ ఇప్పటికే సర్వే ద్వారా ప్రజాబలం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేశామని ప్రజాబలం ఉన్న అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇవ్వనున్నామని స్పష్టం చేసినట్టు సమాచారం. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్య నేతలు తమకు దగ్గరగా ఉండేవారికి టికెట్లు ఇప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.              
 
కానీ సీఎం జగన్ సర్వే చేయించామని అభ్యర్థులను పార్టీ అధినాయకత్వమే నిర్ణయిస్తుందని చెప్పడంతో తమకు దగ్గరగా ఉండేవారికి టికెట్ దక్కుతుందో లేదో అని ముఖ్య నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. మరికొందరు నేతలైతే సర్వే వివరాలను తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సీఎం జగన్ సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశానని చెప్పడంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: