మహారాష్ట్రలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అధికారం చేజిక్కించుకున్న శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర యొక్క 19 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతని పరిపాలనపై చాలా అనుమానాలు ఉండేవి. భారతీయ జనతా పార్టీ కన్నా తక్కువ సీట్లు గెలుచుకున్న శివసేన తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టడంతో కొన్ని దశాబ్దాల పాటు ఉన్న వారి స్నేహం చెడిపోయి ఎన్సీపి మరియు కాంగ్రెస్ తో చేతులు కలిపిన శివసేన అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇది నైతికంగా కరెక్టు కాకపోయినా చట్ట పరంగా మాత్రం ఆమోదించదగ్గ విషయమే.

 

 

ఇక వివరాల్లోకి వెళితే శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి కాంగ్రెస్ తో వారికి పెద్దగా పడట్లేదు. అయితే శివసేన అధ్యక్షుడు మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఉద్ధవ్ థాక్రే ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై తన మార్క్ ను చూపించాలని అనుకుంటున్నాడు. జయలలిత పాలనలో తమిళనాడులో మొదలైన అమ్మ కాంటీన్స్ ఎంత పెద్ద ఘన విజయం సాధించాయి మరియు వాటిని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో దిగ్విజయంగా ఎలా పాటించారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అటువంటి భోజన సదుపాయాలు కి శ్రీకారం చుట్టనున్నారు.

 

 

ఇకపోతే ముంబై, హైదరాబాద్, చెన్నై, కలకత్తా లాంటి మహా నగరాలలో డబ్బావాలా అంటూ కొంతమంది పనివారు ఉంటారు. వారు ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు లేదా ఉద్యోగినుల యొక్క ఇళ్ల నుండి భోజనాన్ని వారి ఇంటి దగ్గర నుండి భార్య దగ్గర నుండి లేదా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం కి వెళ్తే అత్తమామల దగ్గర నుండి తీసుకుని మధ్యాహ్నం లంచ్ సమయానికి ఆఫీసులో చేరవేస్తారు. వారికి వచ్చే ఆదాయం అరకొరగా ఉన్నాకూడా వారికి అందులో మిగిలేది సగమే. ఆదాయం లోని అత్యధిక భాగం అద్దె కట్టడానికే సరిపోనుండడంతో ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే వారందరికీ ఉచిత ఇళ్లను ప్రకటించాడు. అంతే కాకుండా ఉద్యోగం విషయాలలో కూడా సంస్కరణ విధానాన్ని తీసుకొని వచ్చి కేవలం ఐదు రోజులనే పనిదినాలుగా ప్రకటించి అందరి అభినందనలు చూరగొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: