ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలలో విజయం సాధించగా బీజేపీ పార్టీ కేవలం 8 స్థానాలలో విజయం సాధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఫలితాల తరువాత మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేయగా కేవలం ఒక్క రోజులోనే 11 లక్షల మంది క్యాంపెయిన్ ద్వారా భాగస్వాములయ్యారు 
 
ఢిల్లీలో వరుస విజయాలతో దేశవ్యాప్తంగా పార్టీ గుర్తింపు తెచ్చుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గతంలో ఇతర రాష్ట్రాలలో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఇతర రాష్ట్రాలలో పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగి మోదీ, అమిత్ షాలకు ఊహించని షాక్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ఇకపై దేశంలో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ పంజాబ్ తో పాటు ఇతర అసెంబ్లీ ఎన్నికలపై కూడా దృష్టి పెట్టనున్నారని తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ప్రజల్లోకి విసృతంగా వెళ్లి వాలంటీర్లను సిద్ధం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రేమ, గౌరవం లక్ష్యంగా ప్రచారం చేస్తూ సానుకూల జాతీయవాదాన్ని అనుసరిస్తోందని బీజేపీ పార్టీ మాత్రం ద్వేషం, విభజన రాజకీయం మొదలైన అంశాలతో ప్రతికూల జాతీయ వాదాన్ని అనుసరిస్తోందని గోపాల్ రాయ్ చెప్పారు. యావత్ దేశానికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రయోగం ఆదర్శంగా నిలుస్తుందని గోపాల్ రాయ్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేలా కేజ్రీవాల్ ప్రయత్నాలు చేయడం మోదీ, అమిత్ షాలకు షాక్ అనే చెప్పవచ్చు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: