జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై ఇంకా ఆయన అభిమానులకు గానీ జనసేన కార్యకర్తలకు గాని ఇప్పటి వరకు ఏ స్పష్టత రాలేదు అనేది వాస్తవం. రాజీకీయంగా పవన్ కళ్యాణ్ అసలు ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది కనీసం ఆయన సన్నిహితులకు కూడా అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో హడావుడి చేయడం లేదా మీడియా సమావేశాలు పెట్టి జగన్ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం వంటివి పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎక్కువగా చేస్తూ వస్తున్నారు అనే సంగతి అందరికి తెలిసిందే. 

 

ఇప్పుడు ఆయన అమరావతి ఉద్యమాన్ని భుజాన వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అమరావతిలో రాజధాని కోసం చేస్తున్న ఉద్యమం 60 వ రోజుకి చేరింది. ఇప్పుడు దీనిని ఉదృతంగా తీసుకువెళ్ళే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని సమాచారం. చంద్రబాబు ఆదేశాలను అమలు చేసే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు కేంద్రం దృష్టిలో బలంగా పడాలి అంటే ఉద్యమం తీవ్రత అనేది కీలకమని చెప్పినట్టు సమాచారం. అందుకే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. 

 

ఆయన శనివారం అమరావతి పర్యటనకు వెళ్తున్నారు. అయితే దీనికి బిజెపి అడ్డు చెప్పినట్టు సమాచారం. అలా ఒక్కడివే వెళ్లి నిరసనలు చేస్తే బిజేపి, జనసేన మధ్య విభేదాలు ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉందని, పొత్తు పెట్టుకుని నిండా మూడు శుక్రవారాలు కూడా కాకముందే ఈ వైఖరి ఎంత మాత్రం మంచిది కాదు అనే విషయాన్ని ఆయనకు బిజెపి నేతలు వివరించినా సరే పవన్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి కనపడటం లేదని అంటున్నారు. తాను అమరావతి పర్యటనకు వెళ్తా అని చెప్తూ, బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నాకు కూడా ఫోన్ చేసి పవన్ చెప్పెసినట్టు తెలుస్తుంది. దీనితో బిజెపితో పవన్ తెగతెంపులు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: