ఎన్టీఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొన్ని కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. అలాంటి ఈ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో మల్టి స్టార్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని కోట్లమంది అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురుచూస్తున్నారు.     

 

అలాంటి స్టార్ ఈ యంగ్ టైగర్.. ఇలా ఎన్టీఆర్ సినిమాల్లో బిజీ బిజీగా.. రాజమౌళి సినిమా తర్వాత ఈ సినిమా చెయ్యాలి అనే బిజీలో ఉంటే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్ పేరు వేడి వేడిగా వినిపిస్తుంది. 2019 ఎన్నికలు ముగిసిన సమయం నుండి బాబోరు ఘోర ఓటమి పాలైనప్పటి నుండి ఎన్టీఆర్ పేరు భారీగా వినిపిస్తుంది.    

 

ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తేనే టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చిన్నపిల్లోడికి కూడా అర్థం అయ్యింది. అందుకే ఎన్టీఆర్ అభిమానులు.. తెలుగు దేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అని కొందరు అంటే మరికొందరు ఎలాగైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెగ కోరుకుంటున్నారు. 

 

ఇది అంత సరే.. ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ అధికారంలోకి వస్తే చినబాబు పరిస్థితి ఏంటి ? పాపం బాబోరు ఏమో.. కొడుకు లోకేష్ ని ఎలాగైనా ఏపీకి సీఎం చెయ్యాలని అనుకుంటున్నారు... అలాంటి ఈ సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. ఎన్టీఆర్ ని సీఎం చెయ్యాలి అంటారు కానీ.. చినబాబుని కాదు కదా.. ఎందుకంటే.. చినబాబుపై ప్రజలకు అంత నమ్మకం ఉంది మరి.. కొంతమంది అయితే చినబాబు రాజకీయాలకు అసలు పనికిరాడు వారు పార్టీ వారే వాదిస్తారు.. మరి అలాంటి ఈ సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చినబాబు పరిస్థితి ఏం అవుతుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: