ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడటానికి గానూ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. చంద్రబాబు రాష్ట్రంలో ప్రజావేదిక కూల్చడం దగ్గరి నుంచి ఇసుక సమస్య, అమరావతి ఉద్యమం వరకు ప్రతీ ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ భుజాన వేసుకుని పోరాటం చేసింది. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు చంద్రబాబు బస్సు యాత్ర చెయ్యాలి అనుకోవడమే కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్క జగన్ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే మూడు రాజదానులకు మద్దతుగా  చంద్రబాబు  పర్యటన చెయ్యాలి అనుకుంటున్నారు. 

 

మూడు రాజధానులు అనేది ఇప్పుడు ముగిసిన అధ్యాయం అనే విషయం. కాని దాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని ఆయన చంద్రబాబు ప్రజల్లోకి వెళ్ళే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఆశ్చర్య౦గా మారింది చంద్రబాబు పార్టీ నేతలకు. ఈ నెల 17 నుంచి 45 రోజుల పాటు జనచైతన్య యాత్రలు చెయ్యాలని నిర్ణయం తీసుకోవడంతో పాటుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామ౦లో కూడా ఉద్యమం జరగాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇప్పుడు దీనిపై చంద్రబాబు పై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు .

 

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇప్పుడు బలహీనంగా ఉంది. క్షేత్ర స్థాయిలో బలం ఉన్నా సరే నియోజకవర్గ స్థాయిలో నేతల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను అదుపు చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు మీద ఉంది. ముందు నియోజకవర్గ స్థాయి నేతలను మార్చుకోవాలి. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా చాలా మందిని బాధ్యతల నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. కాని చంద్రబాబు అలా చేయకుండా ఇప్పుడు అమరావతిని ఎజెండాగా తీసుకుని చంద్రబాబు ఉద్యమం చేస్తే ఫలితం ఎం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే జరిగితే పార్టీ క్షీణిస్తుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: