ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలిసారు. శుక్రవార౦ ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఆయన అమిత్ షా తో భేటి అయి పలు కీలక విషయాలను ఆయనతో చర్చించినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలతో పాటుగా విభజన చట్టంలో, కేంద్ర హోం శాఖ పరిధిలో ఉన్న విషయాలను ప్రధానంగా షా దృష్టికి జగన్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. రాజకీయంగా కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఆయన వివరించినట్టు సమాచారం. అదే విధంగా అమరావతి ఉద్యమం గురించి కూడా జగన్ షాకు వివరించారు. 

 

అది కేవలం కొన్ని వర్గాలు చేస్తున్న గొడవ అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక పోలవరం ప్రాజెక్ట్ కి రావాల్సిన నిధులు సహా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కూడా అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళారు. బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు అనే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు సిఎం జగన్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక విషయం టీడీపీ నేతలను కలవరానికి గురి చేస్తుంది. గత పది రోజులుగా తెలుగుదేశం పార్టీని ఐటి దాడులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ దాడులు అన్నీ కూడా చంద్రబాబు సన్నిహిత నేతలను లక్ష్యంగా చేసుకునే ఎక్కువగా జరుగుతున్నాయి. 

 

ఇక జగన్, అమిత్ షా ని అంత స్పీడ్ కలవడం, అదీ కూడా రాత్రి వరకు వేచి చూసి కలలవడం టీడీపీ నేతలను కలవరానికి గురి చేస్తుంది. అసలు ఎం జరుగుతుంది అనేది వారికి స్పష్టత రావడం లేదు. పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దీనితో రాష్ట్రంలోని చంద్రబాబు బినామీల సమాచారాన్ని కూడా జగన్... అమిత్ షాకి ఒక నివేదిక రూపంలో ఇచ్చినట్టు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు సహా అమరావతి గురించి, టీడీపీ నేతలకు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న భూములు, బినామీ ఆస్తుల వివరాలను సమర్పించినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: