తన మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసిన ఐటి శాఖ తనదాకా కూడా వస్తుందన్న భయంతోనే  చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లాన్ వేశారు. ఐటి దాడులు, విచారణ, అరెస్టు భయంతోనే ముందుజాగ్రత్తగా ఏకంగా 45 రోజుల బస్సుయాత్రను ప్రారంభించినట్లు అందరూ అనుమానంగా ఉంది. తనకు సన్నిహితులుగా ఉన్న వ్యక్తులు,  ప్రముఖులపై ఐటి శాఖ దాడులు చేయబోతోందని చంద్రబాబుకు ముందుగానే సమాచారం అందినట్లు అనుమానంగా ఉంది.

 

లేకపోతే హఠాత్తుగా 45 రోజుల బస్సుయాత్ర చేపట్టాల్సిన అవసరం ఏముంది ? జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఎనిమిది నెలలే అయ్యిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రతిపక్షం కూడా  అధికారపార్టీకి వ్యతిరేకంగా ఇంత తొందరగా ఆందోళన కార్యక్రమాలు, బస్సుయాత్రల్లాంటివి చేపట్టదు. యాత్రల్లాంటివి ఏవైనా ఉంటే  ఓ మూడేళ్ళ తర్వాత మొదలుపెడుతుంది. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పుడే మొదలుపెట్టేస్తున్నారు.

 

బస్సుయాత్ర వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు ఇపుడు అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. తన పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై దాడులు చేసిన ఐటి అధికారులు ముందు  విచారణ తర్వాత  అరెస్టు చేస్తారని అనుమానించారు చంద్రబాబు. అందుకే బస్సుయాత్ర పెట్టుకుని జనాల మధ్యలో ఉండటానికి ప్లాన్ వేశారు. యాత్ర మధ్యలో ఉన్నపుడు ఒకవేళ ఐటి, ఈడి లేకపోతే సిబిఐ దర్యాప్తు బృందాలు విచారణ చేయాలంటేనో లేకపోతే అరెస్టు దాకా వస్తేనో సింపతి గెయిన్ చేయటానికే యాత్రలు పెట్టుకున్నారు.

 

అవినీతిపై విచారణ లేకపోతే అరెస్టు తప్పదని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే గతంలో కూడా కేంద్రప్రభుత్వం తనపై ఐటి దాడులు చేయించేందుకు కుట్ర చేస్తోందని, అరెస్టులు కూడా చేయిస్తుందని బహిరంగసభల్లోనే చాలాసార్లు చెప్పారు. ఒకవేళ కేంద్రం తనను అరెస్టు చేయిస్తే జనాలే తన అరెస్టును అడ్డుకోవాలంటూ పదే పదే  జనాలను రెచ్చగొట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. సరే చంద్రబాబు ఎన్ని ప్లాన్లు వేసినా విచారణ చేయించాలని అనుకున్నా లేకపోతే అరెస్టు చేయించాలనుకున్నా జరిగేది జరగక మానదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: