ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమా రంగంలో రాణించి రాజకీయాల్లో అడుగుపెట్టడం అనేది ప్రపంచంలోని చాలా దేశాల్లో జరిగింది. మన తెలుగు నేలపై తీసుకుంటే అందుకు భారీ పునాది వేసింది మాత్రం నందమూరి తారక రామారావు. సినిమాల్లో సాధించిన పేరు ప్రఖ్యాతులను రాజకీయ రంగంలో కూడా కొనసాగించారు. తన వాగ్దాటితో సినిమాల్లో కాదు.. రాజకీయాల్లో కొనసాగించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తర్వాత రాజకీయాల్లో అంతటి ఇంపాక్ట్ చూపించింది నందమూరి వంశం నుంచి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి.

 

 

2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపు స్టార్ క్యాంపయినర్ గా తన మార్క్ చూపించాడు. 1983లో ఎన్టీఆర్ ఖాకీ దుస్తుల్లో ఎలా ప్రచారానికి వెళ్లారో అలానే జూనియర్ కూడా అవే ఖాకీ దుస్తుల్లో ప్రచారంలో దూసుకుపోయాడు. అంత చిన్నవయసులో, అశేష జనసందోహం మధ్య సమకాలీన రాజకీయ అంశాలపై సంధించిన తన వాగ్ధాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఏమాత్రం వణుకు లేకుండా తొణకకుండా ప్రత్యర్ధులపై విమర్శలు లేకుండా కేవలం పార్టీ ఆవశ్యకతను, ప్రజల కోసం చేయబోయే కార్యక్రమాల గురించి.. అప్పటివరకూ ప్రజలకు చేసింది వివరిస్తూ సాగిన ఆయన ప్రచారం 2009 అసెంబ్లీ ఎన్నికలకే హైలైట్ అని చెప్పాలి.

 

 

ఎవరికైనా జ్ఞాన సంపత్తి ఉండడం సాధారణమే అయినా.. జూనియర్ వాగ్దాటి మాత్రం తాత ఎన్టీఆర్ ను పోలి ఉండడం నిజంగా ఆశ్చర్యమే. భవిష్యత్తులో టీడీపీకి ఆశాకిరణం జూనియర్ ఎన్టీఆరే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పట్లోనే ఓ అంచనాకు వచ్చేశారు. అయితే.. సినిమాల్లో కెరీర్ ను ఇంత చిన్న వయసులో వదులుకోవడం ఆయనతోపాటు అభిమానులకూ ఇష్టం లేక, పరిస్థితు ప్రభావంతో కూడా మళ్లీ రాజకీయాల్లోకి రాలేదు. భవిష్యత్తులో ఆ కోరిక నెరవేరుస్తాడేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: