లోక్ సభ ఎన్నికల్లో తురుగులేని మెజార్టీ సాధించి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ఎన్నికలు గట్టి షాక్ నే ఇచ్చాయి. దేశంలోనే పెద్ద పార్టీగా ఎదిగిన తర్వాత తమకి తిరుగులేదని భావించి ఉంటారు. కానీ అలా అనుకోవడానికి వీల్లేదన్నట్టుగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఫలితాలు రుజువు చేశాయి. మొత్తం డెభ్బై సీట్లలో 62 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమై ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకుంది.

 

 


గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్లు మెరుగుపడ్డాయి.. కానీ నేషనల్ లెవెల్ లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కావడం ఆలోచించాల్సిన విషయమే. అయితే నీజేపీ ఓడిపోయిన దగ్గర నుండి రకరకాల వాళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు బీజేపీ నాయకులు తమకి గతంలో కంటే సీట్లు పెరిగాయని సంబరపడుతుంటే, మరికొందరు అధికారం రాలేదని బాధపడుతున్నారు.

 

 

పార్టీ పెద్ద అమిత్ షా ఈ విషయంలో కొంత పశ్చాత్తాప వైఖరితో కనబడ్డాడు. విషయంలోకి వెళితే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులు చాలా పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా షహీన్ బాగ్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ బిర్యానీ పాకెట్లు పంచి పెడితే, బీజేపి నాయకులు గోలీమారో లాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పుడు అవే వ్యాఖ్యలు బీజేపీని ఓడించాయని అమిత్ షా అంటున్నాడు.

 

 


ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అమిత్ షా అభిప్రాయ పడుతున్నాడు. అమిత్ షా మాటలు విన్న వారిలో కొందరు ఇప్పుడైనా తెలుసుకున్నారు అదే మంచిది అను అనుకుంటుంటే, మరికొందరు అలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. కేవలం ఇలా మాట్లాడటం వల్ల ఒరిగేదేమీ ఉండదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: