ఇండియాలో దోపిడీ దార్లు ఎక్కువయ్యారని రోజూ పత్రికల్లొ చదువుతూనే ఉన్నాం. ఇక్కడ దొచేసిన సొమ్ముతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ చట్టానికి, న్యాయానికి కనబడకుమ్డా తప్పించుకు తిరుగుతున్నారని అనుకుంటూ ఉంటున్నాం. ఈ విషయంలో భారత న్యాయస్థానాలు గానీ, చట్టాలు గానీ సరిగ్గా పనిచేయట్లేదని ప్రతీ సారి విమర్శిస్తూనే ఉన్నాం. సాధారణంగా ఎవరైనా పారిశ్రామికవేత్త బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టినపుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువ వినిపిస్తుంటాయి.

 

 


పారిశ్రామిక వేత్తలు బ్యాంకులకి రుణాలని ఎగ్గొట్టడం అనే మాట వినగానే మనకు గుర్తొచ్చేవి రెండే పేరులు ఒకటి విజయ్ మాల్యా.. రెండు నీరవ్ మోదీ..వీరిద్దరూ భారతీయ బ్యాంకులకి టోపీ పెట్టి విదేశాల్లో దాక్కుని విలాసాలు చేస్తున్నవారే. ప్రస్తుతం మనం విజయ్ మాల్యా గురించి మాట్లాడుకుందాం..ప్రస్తుతం లండన్ లో ఉన్న విజయ్ మాల్యా లండన్ కోర్టుకి తన వాదనని విన్నవించుకున్నాడు.

 

 

మాల్యాని ఇండియాకి అప్పగించాలని భారత్ ఏనాడో చెప్పింది. ఈ విషయమై విజయ్ మాల్యా ఇండియాకి పంపే నిర్ణయం మీద సవాలు చేస్తూ బ్రిటీష్ హైకోర్టు అప్పీలు చేశాడు. దీనిపై మూడు రోజులు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్తుకి హాజరైన మాల్యా మీడియాతో మాట్లాడుతూ.. నేను రుణపడిన మొత్తాన్ని బ్యాంకులు తిరిగి తీసుకోవాల్సిందిగా చేతులు ఎత్తి దండం పెట్టి కోరుతున్నానని చెప్పాడు. ఇంకా, నేను ఏ నేరం చేయలేదు.. కానీ తీసుకున్న అప్పులని కట్టలేదని బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరీ నా ఆస్తులని అటాచ్ చేసింది.

 

 

కానీ నేను చెబుతున్నది ఒకటే.. బ్యాంకులు మీకు రుణపడిన మొత్తాన్ని తీసుకోండి అని చెప్తున్నాడు. భారత్ కి తిరిగిరావాలనే ఆలోచన ఉందా అని అడగగా, నాకెక్కడ ప్రయోజనకరంగా ఉంటుందో అక్కడే ఉంటానని చెప్పుకొచ్చాడు. విజయ్ మాల్యా ఇలా మాట్లాడటం చూస్తుంటే కేసు విషయంలో మనం గెలిచినట్టే అని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: