చంద్రబాబునాయుడుకు సంబంధించి తెలుగుదేశంపార్టీ సంచలన ప్రకటన చేసింది. పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మాట్లాడుతూ చంద్రబాబును కుక్కతో పోల్చారు.  అనూరాధ వ్యాఖ్యలు విన్న మీడియా ప్రతినిధులు,   పార్టీ నేతలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఐటి  దాడుల నేపధ్యంలో మంత్రులు, వైసిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  చంద్రబాబును మంచి కుక్కగా అభివర్ణించారు. చంద్రబాబు లాంటి మంచి వ్యక్తిపై ఐటి దాడులు మరకలు అంటించటం దారుణమంటూ మండిపడ్డారు.

 

చంద్రబాబు లాంటి మంచి నేతలను చూసి మంత్రులు, వైసిపి నేతలు ఓర్వలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.  తమకు లాగే అందరూ అవినీతిపరులే అవుతారని వైసిపి నేతలు అనుకుంటున్నట్లు ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగానే చంద్రబాబును కుక్కతో పోల్చారు. మంచి కుక్కను చంపేయాలంటే ముందుగా పిచ్చి కుక్క అంటూ ముద్రవేయాలన్న నానుడిని ఆమె గుర్తు చేశారు. ఈ పద్దతిలోనే చంద్రబాబు లాంటి మంచి కుక్కుపై కూడా అవినీతి అనే ముద్ర వేస్తున్నట్లుగా ఆమె చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  తమంతట తాముగా మంత్రులు, వైసిపి నేతలు చంద్రబాబుపై ఆరోపణలు మొదలుపెట్టలేదు. చంద్రబాబు దగ్గర పిఎస్ గా  పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ పై ఐటి దాడులు జరగటం, తర్వాత సోదాల్లో రూ. 2 వేల కోట్ల విలువైన  బ్లాక్ మనీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు ఐటి శాఖ అధికారికంగా రిలీజ్ చేసిన ప్రకటనతో  సంచలనం మొదలైంది.

 

ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు చంద్రబాబుకు  పెండ్యాలే కళ్ళు, చెవులుగా వ్యవహరించారన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి తోడు శ్రీనివాస్ ఇంట్లో జరిపిన సోదాల్లో  డైరీలు, డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు భారీగా సీజ్ చేశారు. దాంతో పాటు కడప, హైదరాబాద్ లో జరిపిన దాడుల్లో కూడా టిడిపి నేతల కార్యాలయాలు, ఇళ్ళపైనే దాడులు జరగటంతో సహజంగానే  ఆరోపణలకు చంద్రబాబు కేంద్రంగా మారిపోయారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: