చంద్రబాబునాయుడు నైజమే అంత. అవసరానికి ఫుల్లుగా వాడేసుకోవటం, అవసరం తీరిపోంగానే దోమనో ఈగనో తోలినట్లు తోలేయటం. చంద్రబాబు నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు చూసినా ఇదే కనబడుతుంది. ఇదంతా ఎందుకంటే తాజాగా చంద్రబాబు దగ్గర పిఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ కు తమకు ఏ విధమైన సంబంధం లేదని పార్టీ తేల్చేసింది.     

 

ఐటి దాడులపై మాట్లాడటానికి భయపడుతున్న చంద్రబాబు  మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో మాట్లాడించారు. యనమల మాట్లాడుతూ పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై ఐటి దాడులు జరగటం, రూ. 2 వేల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలు జరిగితే టిడిపికి అంటకట్టడమేంటంటూ చాలా అమయాకంగా ప్రశ్నించారు. శ్రీనివాస్ సంపాదనతో  చంద్రబాబుకు కానీ తెలుగుదేశంపార్టీకి గానీ ఏ విధమైన సంబంధం లేదట. పైగా చంద్రబాబు దగ్గర ఇప్పటికి 40 మంది పిఏలు 20 మంది పిఎస్ లు పనిచేశారని గొప్పగా చెప్పారు. కానీ యనమల మరచిపోయిన విషయం ఒకటుంది. గతంలో పనిచేసిన పిఎస్ లు పిఏలు ఎవరూ ఇలా ఐటి దాడుల్లో దొరకలేదు.

 

మొత్తం మీద యనమల మాటలతో అర్ధమవుతున్నదేమంటే శ్రీనివాస్ ను తన ఖర్మకు తనను  చంద్రబాబు వదిలేశాడని.    అవసరమున్నంత కాలం ప్రతి అడ్డమైన పనికి వాడుకోవటం అవసరం తీరిపోగానే వదిలేయటం చంద్రబాబుకు అలవాటే. ఇపుడు పెండ్యాల పరిస్ధితి అంతే. కాకపోతే  ఇక్కడ యనమల మరచిపోయిన ఇంకో విషయం ఏమిటంటే పెండ్యాల మామూలు చేప కాదు. చాలా పెద్ద చేపనే చెప్పాలి. లేకపోతే రూ. 2 వేల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలు ఎలా చేయగలుగుతాడు ?

 

చంద్రబాబు హయాంలో జరిగిన లావాదేవీల విషయంలో తాను అప్రూవర్ గా మారిపోతానని ఐటి అధికారులకు రాసిచ్చాడంటూ ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ తగులుకుంటే    చంద్రబాబు కూడా ముణగటం ఖాయం. కాబట్టి శ్రీనివాస్ పై ప్రేమతో కన్నా తన కోసమైన పెండ్యాలను రక్షించుకోవాల్సిన అవసరం చంద్రబాబు చాలా ఉంది. మరేం చేస్తాడో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: