ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వ్యవహారం రోజు రోజుకి ముదురుతుంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. మండలిలో బిల్లులను సెలెక్ట్ కమిటీకి చైర్మన్ పంపిన రోజు నుంచి నేటి వరకు కూడా దీనిపై ఉత్కంట కొనసాగుతూనే ఉంది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేది లేదని ప్రభుత్వం అంటే... మీరే కోర్ట్ లో చెప్పారు కదా బిల్లులు సెలెక్ట్ కమిటీలో ఉన్నాయని, అలాంటప్పుడు ఏ విధంగా సెలెక్ట్ కమిటీకి మీరు సహకరించరు అంటూ విపక్ష తెలుగుదేశం ప్రశ్నిస్తుంది. సెలెక్ట్ కమిటీకి వెళ్ళడం అసాధ్యం అని ఆ అధికారాలు అసలు చైర్మన్ కి లేనే లేవు అంటుంది వైసీపీ. 

 

ఇక ఇక్కడ మండలి కార్యదర్శి కూడా విపక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం లేదని ఆయన రెండు సార్లు తిప్పి పంపారు. శుక్రవారం సాయంత్రం కూడా బిల్లులను వెనక్కి పంపించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో దూకుడుగా వెళ్లాలని భావిస్తుంది. మండలి చైర్మన్ తో సంబంధం లేకుండా అసలు మండలితోనే సంబంధం లేకుండా బిల్లులను సెలెక్ట్ కమిటీ లో ఉంచే గోల లేకుండా ఆర్డినెన్స్ తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్లులను గవర్నర్ కి పంపాలా అనే దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచనలో పడింది. 

 

అయితే ఆర్డినెన్స్ తీసుకొస్తే ఏ విధంగా ఇబ్బందులు ఉండవు అని జగన్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మండలి సెక్రటరిని మార్చే అధికారం కౌన్సిల్ చైర్మన్ కి ఉండదని అంటున్నారు టీడీపీ సీనియర్ నేత, మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు. ఆయనపై కోర్ట్ కి వెళ్ళే ఆలోచన కూడా టీడీపీ చేస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి మేము సిద్దమని అంటుంది వైసీపీ. ఇలా ఇప్పుడు మండలి వ్యవహారం ఊహించని విధంగా మలుపులు తిరుగుతుంది. ఇంకో వాదన కూడా ఇప్పుడు వినపడుతుంది. సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో వేచి చూసే ధోరణిలో ప్రభుత్వం ఉందని కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: