ఊహించని విధంగా బీజేపీ మద్దతు వైసిపి ప్రభుత్వానికి లభించడంతో ఏపీ సీఎం జగన్ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అన్ని విషయాలపై చర్చించారు జగన్. ఆ సందర్భంగా ఏపీకి, ఏపీ ప్రభుత్వానికి తాము అన్నిరకాలుగా అండగా ఉంటామంటూ ప్రధాని జగన్ కు హామీ ఇచ్చారు. ఏపీలో తాను తీసుకున్న నిర్ణయాలకు జగన్ ప్రధాని మద్దతు కూడా పొందడంతో వైసీపీలో జోష్ కనిపించింది. ఇక నిన్న ఆకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తాను తీసుకున్న నిర్ణయాలు దానిపైన వివాదాలు తదితర అంశాల గురించి సుమారు 40 నిమిషాల పాటు జగన్ చర్చించారు.


 ఈ సందర్భంగా ఏపీ కి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, సంక్షేమ పథకాలు తదితర వాటి కోసం నిధులు విడుదల చేయాల్సిందిగా జగన్ అమిత్ షా ను కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా బీజేపీతో కలిసి మీరు పనిచేయాల్సిందిగా జగన్ ను కోరడంతో కేంద్ర కేబినెట్ లోకి వైసీపీలో ఇద్దరిని తీసుకునేందుకు జగన్ తో చర్చించగా దానిపై జగన్ ఏ సమాధానం ఇవ్వకుండా మౌనంగా చిరునవ్వు నవ్వారట. వైసిపి తో కలిసి పనిచేసే విషయంలో బీజేపీ అగ్రనేతలు చాలా ఉత్సాహంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ ఏదైనా సమస్య గురించి గానీ, ఏదైనా విషయం గురించి గానీ కేంద్ర  మంత్రులను, అధికారులను కలిస్తే వెంటనే ఆ పని వెనకా ముందూ చూడకుండా చేయాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు ఆయా శాఖల అధికారులకు కేంద్ర మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 


మంత్రివర్గంలో చేరే విషయమై అటు జగన్ ఇటు బీజేపీ అగ్ర నేతలు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిపై తర్వాత తమ తమ పార్టీల్లో చర్చించి ఒక ప్రకటన చేసేందుకు రెండు పార్టీల నేతలు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిజెపి జగన్ తో కలిసి ముందుకు వెళ్లడంపై  వైసీపీ, ఏపీ  బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువుగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఏపీలో ఉనికి లేకుండా చేయాలి అన్నది ప్రధాన ఎజెండాగా ఈ రెండు పార్టీలు ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: