అప్పటి వరకు ఆనందం గా బంధు మిత్రుల తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. సొంత ఊరి వాళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ వివాహాని కి హాజరయ్యారు. సాధారణంగా వివాహం అనంతరం డీజే ఏర్పాటు చేసారు. పెళ్లి చేసుకున్న నవ దంపతులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా వెళ్లి డీజే లో పాల్గొన్నారు. ఈ వేడుకలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసారు. దీనితో ఆ ప్రాంతం మొత్తం సందడి సందడి గా ఉంది. మద్యం తాగి కొందరు డాన్స్ లు వేసారు. అంతా బాగానే ఉంది. 

 

ఇంత లో విషాదం చోటు చేసుకుంది. డీజే సౌండ్ కి పెళ్లి కొడుకు కుప్పకూలిపోయాడు. వెంటనే హుటాహుటిన ఆస్పత్రి కి తరలించారు అక్కడ ఉన్నారు. దాదాపు రెండు గంటల పాటు అతని కి చికిత్స చేసినా లాభం లేకపోయింది. ప్రాణాలు కోల్పోయాడు పెళ్లి కొడుకు. చివరికి రెండు గంటల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన తెలంగాణా రాష్ట్రం లోని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరిగింది. మంగళి గణేశ్ అనే 25 ఏళ్ళ యువకుడు డీజే సౌండ్ కి ప్రాణం కోల్పోయాడు. 

 

శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరగ గా, సాయంత్రం పెద్ద ఎత్తున బారాత్ నిర్వహించారు. ఈ సమయం లోనే అతను డీజే సౌండ్ కాస్త ఎక్కువగా ఉండటం తో స్పృహ తప్పిపోయాడు. ఈ ఊహించని పరిణామం తో ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద చాయలు అలముకున్నాయి. కలిసి ఏడు అడుగులు వేసిన భర్త ఉన్నట్టుండి అలా మరణించడంతో పెళ్లి కుమార్తె, ఆమె బంధువులు ఒక్కసారిగా శోకసంద్రం లో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీజే సౌండ్ తోనే మరణించాడా లేక మరేదైనా కారణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: