సోషల్ మీడియాలో ఎక్కువగా గాలి వార్తలు ప్రచారంటున్నాయని నానుడి. ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు ముఖ్యంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బాగా ఉపయోగిస్తారని ప్రచారం. మరి కొందరు నేతలు మాత్రం ప్రజా ప్రయోజనాల కోసం వేదికగా చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇరాక్ లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆలంబన దొరికినట్లయింది.  ఇరాక్ లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, నకిలీ ఏజెంట్ల మోసంతో ఆక్కడ చిక్కుకొని వసతి సౌకర్యాలు లేక సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక మూడు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తున్నామని మంత్రి కేటీఆర్ కు తెలిపారు.

 

ఇరాక్ లో చిక్కుకున్న 16 మంది తెలంగాణకు చెందిన వలస కార్మికులను  హైదరబాద్ కు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం. అసలేం జరిగిందంటే.. మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సోషల్ మీడియా ద్వారా విన్నవించుకున్న ఇరాక్ లో చిక్కుకున్న బాధితులు. దీనితో డొంక కదిలింది. వలస కార్మికులు విముక్తులయ్యారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులకు సమాచారం అందించి, వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని సూచించారు..

 

ఈ మేరకు ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయం తో, భారత విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసిన తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ, అక్కడ ఇరాక్ లో చిక్కుకున్న వారిని తెలంగాణకు రప్పించారు. ఫిబ్రవరి 15 వ తేదీ  తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. వీరందరిని వారి సొంత ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన  రవాణా సౌకర్యాలను కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ సమకూర్చింది.

 

తమ బాధలకు స్పందించి వెంటనే సహాయం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కి వారంతా ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో వేగంగా స్పందించిన తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ అధికారి చిట్టి బాబుకి, మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: