బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విషయంలో పార్టీ జాతీయ నాయకత్వం సంచలనం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.  పార్టీని సమర్ధవంతంగా నడిపించటంలో కన్నా అనుకున్నంతగా ఎఫెక్టివ్ గా పనిచేయటం లేదనే అభిప్రాయంలో  ఢిల్లీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.  మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబునాయుడుకి మాడు పగిలిపోయింది. 175 అసెంబ్లీ సీట్లలో టిడిపి కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితమైందంటే ఏ స్ధాయిలో దెబ్బ పడిందో అందరికీ అర్ధమైపోయింది.

 

జగన్ దెబ్బకు టిడిపి దాదాపు కుదేలైపోయినట్లే. అదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. సరే మారిన పరిస్ధితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపి పంచన చేరారనుకోండి అది వేరే సంగతి. పై పార్టీలు పోను రాష్ట్రంలో మిగిలింది ఒక్క బిజెపి మాత్రమే. ప్రధాన ప్రతిపక్షం టిడిపి పెద్దగా ప్రభావం చూపలేకపోవటాన్ని కూడా కన్నా అడ్వాంటేజ్ తీసుకోలేక పోతున్నారని జాతీయ నాయకత్వం అభిప్రాయానికి వచ్చిందట.

 

అదే సమయంలో జనసేన మిత్రపక్షం అధినేత పవన్ సామాజివకవర్గం, కన్నా సామాజికవర్గం ఒకటే. అంటే ఒకే  స్ధాయిలో ఇద్దరు కాపులు అవసరం లేదనే అభిప్రాయానికి కూడా నాయకత్వం వచ్చింది. వ్యక్తిగత హోదాలో తీసుకుంటే పవన్ ముందు కన్నా ఎందుకూ పనికిరాడు. ఎందుకంటే ఇద్దరికీ జనాలపై ప్రభావం చూపేంత సీన్ లేదని మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. కాకపోతూ పవన్ ఎక్కడ సభ పెట్టినా, ర్యాలీ తీసిన అభిమానులు మాత్రం లెక్కకు మించి వచ్చేస్తారు. అదే కన్నా పిలుపిస్తే పట్టుమని వందమంది కూడా ఉండరు.

 

రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయ శూన్యత ఉంది. ఈ అంశం మీదే కన్నా స్ధానంలో మరొకరిని అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుందని అనుకున్నారట. బహుశా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత అధ్యక్షుడి మార్పు  ఉంటుందని అనుకుంటున్నారు. ఎంఎల్సీ మాధవ్, ముఖ్య అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల తదితరులు రేసులో ఉన్నట్లు సమాచారం. మరి జాతీయ నాయకత్వం ఎవరిని ఎంపిక ఏమి ఆలోచిస్తుందో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: