ఆయన మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన, రాష్ట్ర రాజకీయాలను కూడా శాశించిన నేత. ఎక్కడా కూడా రాజీలేని తత్వం. పరిపాలనలో ఎంతో అనుభవం, సొంత జిల్లాలో ఒంటి చేత్తో ఎందరికో సీట్లు ఇప్పించిన నేత. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన రాజకీయాలకు ఉద్దండులు కూడా చుక్కలు చూసారు. మంత్రిగా కీలక శాఖను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్న మంత్రి ఆయన. కాని ఇప్పుడు సొంత జిల్లాలో నానా ఇబ్బందులు పడుతున్నారు. 

 

ఆయనే తెరాస కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు తెరాస లో నానా అవస్థలు పడుతున్నారు. రాజకీయంగా బలంగా లేకపోవడం దానికి తోడు కెసిఆర్ మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడంతో ఇప్పుడు ఆయన ప్రాభల్యం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాగా తగ్గింది అంటున్నారు. పాలేరు నుంచి 2018 లో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కందాల ఉపేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ నేత చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కందాల తెరాస తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన మాట చెల్లడం లేదు. 

 

మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆశించిన వారికి ఆయన సీట్లు ఇవ్వలేకపోయారు. తన వర్గం ఎన్ని విధాలుగా తుమ్మల మీద ఒత్తిడి తెచ్చినా నా చేతిలో ఏమీ లేదు నేను చేయలేను అని తప్పుకున్నారు. ఇప్పుడు సహకార సంఘం ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుంది. తుమ్మల మాట చెల్లడం లేదు. తమ వర్గాన్ని గెలిపించుకోవడానికి కందాల వద్ద అధికార బలం ఉంది. కాని తుమ్మల చేతిలో ఏమీ లేకపోవడంతో ఆయన లాగే చూస్తుండిపోయారు. దీనితో తుమ్మల అభిమానులు ఆయన పార్టీ మారాలని కోరుతున్నారు. అక్కడ భవిష్యత్తు ఉండదు అని బిజెపిలోకి వెళ్ళాలి అని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: