ఏపీలో కకాలకాలం రేపుతున్న ఐటీ దాడుల వ్యవహారంలో టీడీపీ అగ్ర నాయకులు పీకల్లోతులో మునిగిపోయినట్టుగా కనిపిస్తున్నారు. రోజుకో వ్యవహారం బయటకి వస్తుండడం, ఇప్పటికే అవినీతి  వ్యవహారాలు, భారీగా సొమ్ములకు సంబంధించి అనేక వ్యవహారాలు బయటకి వస్తున్నాయి. తొందర్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కేసుల్లో ఇరుక్కుని జైలుకి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోందది. అయినా ఈ విషయంపై టీడీపీ నాయకులు స్పందిస్తున్నారు తప్ప అధినేత చంద్రబాబు మాత్రం ఎక్కడా నోరు మెదిపేందుకు ఇష్టపడడంలేదు. 

 

చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గర దొరికిన ఆధారాలను బట్టి నారా లోకేష్ కు సంబంధించిన బినామీ కంపెనీల్లో అనేక అక్రమాలు జరిగాయని వైసిపి నాయకులు గట్టిగా విమర్శిస్తున్నారు. నిన్ననే 24 మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి మరి చంద్రబాబు పని అయిపోయిందని, ఆయన త్వరలోనే జైలుకు వెళ్ళిపోతారు అంటూ హడావుడి చేశారు. చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉండగా మూడు లక్షల కోట్లకు పైగా అక్రమంగా కూడబెట్టారని గట్టిగా విమర్శలు చేశారు. అయితే దీనిపై  తెలుగుదేశం నుంచి అంతగా రియాక్షన్ రాలేదు. కేవలం నలుగురైదుగురు నాయకులు మాత్రమే స్పందిస్తున్నారు. అసలు చంద్రబాబుకు ఆయన మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో దొరికిన ఆధారాలకు చంద్రబాబు కు ఏ మాత్రం సంబంధం లేదని టిడిపి నాయకులు స్పందించారు. 

 

అయితే ఈ నెల 17వ తేదీ నుంచి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో టీడీపీకి ఇది ఇబ్బందికరంగానే మారింది. టిడిపి పై ఏదైనా చిన్న విమర్శ వస్తే స్పందించే చంద్రబాబు ఇప్పుడు తన పైన, తన కుమారుడు పైన ఇంత పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్నా కనీసం దీనిపై స్పందించేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న ఆయన మీడియా ముందుకు కూడా వచ్చేందుకు ఇష్టపడకపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోంది. ఈ వ్యవహారాలపై  చంద్రబాబు స్పందించకపోవడంతో ఆయనకు ఈ అక్రమ వ్యవహారాల్లో సంబంధం ఉన్నట్లుగా వైసీపీ చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: