గత కొద్దీ కాలంగా ఏపీలో రాజకీయం వడ వేడిగా సాగుతున్నా విషయం అందరికి తెలిసిందే. మూడు రాజధానుల విషయంపై అమరావతిలో ఇంకా రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అదికాక ప్రస్తుతం పారిశ్రామిక కంపెనీలోను వైసీపీ ప్రభుత్వం తన వైఖరి చూపుతుందని టీడీపీ నేతలు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా నారా లోకేష్ కూడా వైసీపీ ప్రభుత్వం పై ఎద్దేవా చేశారు.  

 

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. టీడీపీ తీసుకొచ్చిన కంపెనీలన్నింటినీ వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కియా మోటార్స్ విషయంలో లెటర్ చదువుతూ, అధ్యక్షా అంటూ మంత్రి బుగ్గన బుర్ర కథ వినిపించారని విమర్శించారు. అలాగే, చంద్రబాబుగారి హయాంలో కష్టపడి తెచ్చిన టీసీఎల్ ని కూడా వారి ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు.

 

ఇప్పుడు టోరే వంతు వచ్చిందని... చంద్రబాబు ఈ కంపెనీ కోసం ఎంతో కష్టపడి, వారితో ఫాలో అప్ చేసి, తీసుకువచ్చారని నారా లోకేశ్ అన్నారు. టీడీపీ హయాంలో భూమి పూజ అయిపోయిన కంపెనీని, అప్పుడే బిల్డింగులు రెడీ అయిపోయిన కంపెనీని, ఇప్పుడు తామే తెచ్చినట్టు హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు.

 

టీడీపీ హాయంలో భూమి పూజ జరిగి, భవనం సిద్ధమైన కంపెనీని ఇప్పుడు తామే తెచ్చినట్లు హాడవుడి చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. జరగాలి పెళ్లి మళ్ళీమళ్ళీ.. అనే కాన్సెప్ట్ ముఖ్యమంత్రి జగన్ గారిని చూసే పెట్టారేమో అని లోకేశ్ ఎద్దేవా చేశారు.

 

ఎంతో కష్టపడి ఈ కంపెనీ తీసుకువచ్చామని కియా మోటర్స్ విషయంలో లెటర్ చదువుతూ...అధ్యక్షా అంటూ మంత్రి బుగ్గన బుర్ర కథ వినిపించారని అన్నారు. ఎంతో కష్టపడి ఈ కంపెనీని తీసుకువచ్చామన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం కియా మోటార్స్‌ను బెదిరించినట్టు, ఈ కంపెనీని కూడా బెదరగొట్టి తరిమేయ కండి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: