అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్ లో తనను నంబర్ 1 గా, ప్రధాని నరేంద్ర మోదీని నంబర్ 2 గా జుకర్ బర్గ్ పేర్కొనడం పట్ల జుకర్ బర్గ్ కు కృతజ్ఞతలు తెలిపారు. జుకర్ బర్గ్ తనకు ఇచ్చిన గౌరవం ఇది అని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాబోయే రెండు వారాలలో తాను ఇండియాకు వెళుతున్నానని ఇండియా పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. 
 
ఈ నెల 25వ తేదీన ట్రంప్ తన భార్య మెలనియాతో కలిసి భారత పర్యటనకు రానున్నారు. అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్, మోదీ అతి పెద్ద దేశాలైన భారత్, అమెరికా మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించటం కొరకు కృషి చేస్తున్న సమయంలో ట్రంప్ భారత్ లో పర్యటించనుండటం పట్ల ఆసక్తి నెలకొంది. ట్రంప్ తన భారత పర్యటనలో అహ్మదాబాద్, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నట్టు తెలుస్తోంది. 
 
లక్షల సంఖ్యలో ప్రజలు అహ్మదాబాద్ లో మోదీకి ఘన స్వాగతం చెప్పనున్నారని తెలుస్తోంది. ట్రంప్ మరియు మోదీ అతి పెద్దదైన మొతెరా క్రికెట్ స్టేడియంలో ఉమ్మడిగా ప్రసంగించనున్నారు. వాణిజ్య వర్గాలు ట్రంప్ మోదీ భేటీ వలన ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. ఇండియా అమెరికాతో పరిమితమైన ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 
 
ఇండియా అమెరికాలో పౌల్ట్రీ, డెయిరీ మార్కెట్లను పాక్షికంగా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. భారత ప్రభుత్వం అమెరికా దేశపు సరుకులపై సుంకాలను తగ్గిస్తే మాత్రం ట్రంప్ వాణిజ్య సంబంధ ప్రాధాన్యతలను పునరుద్ధరించేందుకు అంగీకరించవచ్చని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: