ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రబాలెంలో దీక్ష చేస్తున్న రాజధాని ప్రాంత రైతులకు మద్దతు తెలిపారు. దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఉదయం నుంచి రాజధాని గ్రామాల్లోనే ఉన్న ఆయన, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని కోసం తాను అండగా ఉంటాను అంటూ స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ రావడంతో దీక్షా శిబిరం వద్దకు పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు.

 

అనంతరం ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లి రాజధాని అవసరం లేదు, భూములు ఇవ్వాలని ఎవరైనా అడిగారా అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. వెంటనే కలుగజేసుకున్న రైతులు కొందరు డ్రైవర్లు, పని వాళ్ళను రైతుల ముసుగులో వైసీపీ నేతలు తీసుకువెళ్లినట్టు పవన్ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. అదే విధంగా తాను బిజెపి పెద్దలతో కూడా స్పష్టంగా మాట్లాడా అని, బిజెపి కూడా అమరావతికి కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. జగన్ ఢిల్లీ పర్యటనపై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేసారు. 

 

ప్రధాని నడిపేది దేశాన్ని గానీ, బిజెపిని కాదని అని అన్నారు పవన్ కళ్యాణ్. ఢిల్లీ ఎన్నికల దృష్ట్యా బిజెపితో తాము ర్యాలీని వాయిదా వేశామని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని రైతుల కోసం తప్పకుండా ర్యాలీ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వానికి ఉన్న విస్తారమైన అధికారాలతో కేంద్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని పవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎవరు వచ్చినా రాకపోయినా తాను రైతుల తోనే ఉంటా అని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: