కాలం కలిసి రాకపోతే చిన్న పోరాటే పెద్ద ప్రమాధానికి కారణం అవుతుంది. అదే టైం మనదే అయితే ఎంత పెద్ద ప్రమాదం మన పక్కన ఉన్నా హ్యాపీగా బయటపడిపోతాం. అలాంటి వింత సంఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఓ వ్యక్తి హెల్మెట్‌ లో అత్యంత విషపూరితమైన పామును పెట్టుకొని పదకొండు కిలో మీటర్లు ప్రయాణించాడు. అయినా అతణ్ని ఆ పాము కాటేయకపోవటం విశేషం.

 

వివరాళ్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని కందనాడ్‌ అనే ప్రాంతంలోని టీచర్‌ గా పనిచేస్తున్న రంజిత్ అనే వ్యక్తి ఈ వింత అనుభవం ఎదురైంది. మేరీ స్కూల్‌ లో సంస్కృత బోధకుడిగా పని చేస్తున్న రంజిత్‌, ఫిబ్రవరి 5న తరగతులు ముగించిన మరో స్కూల్‌ లో ట్యూషన్‌ చెప్పేందుకు బయలు దేరాడు. రోజు లాగే హెల్మెట్ ధరించి 11 కిలో మీటర్లు ప్రయాణించి మరో స్కూల్‌ కు చేరుకున్నాడు.

 

అయితే ఆ స్కూలు దగ్గర దిగిన తరువాత రంజిత్‌కు అసలు విషయం తెలిసింది. తన హెల్మెట్ చిన్న విష సర్పం కనిపించింది. ఆ పామును చూసిన రంజిత్‌ కు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. అప్పటికే ఆ పాము చనిపోయినా తనను కాటు వేసిందేమో అన్న అనుమానం రజింత్‌ కు మరింత భయం కలిగించింది. అయితే రంజిత్‌ పరిస్థితిని గమనించిన ఆయన సహోద్యోగులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

 

అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌లు రంజిత్‌ రక్తంలో విషానికి సంబంధించిన ఆనవాలు ఏమీ లేదని తేల్చి చెప్పారు. అతని ఒంటి మీద కూడా పాము కాటుకు సంబంధించిన గాయలు లేవని కాబట్టి రంజిత్‌ భయపడాల్సిన అవసరం లేదని చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇటీవల కేరళలో ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి వరుసగా రెండేళ్లు వరదలు రావటం తో కేరళ రాష్ట్రంలో పాముల బెడద ఎక్కువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: