ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరుసగా రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేపట్టడం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. మొదటిసారి ఢిల్లీ పర్యటన సమయంలో ప్రధాని మోడీ ని కలిసిన జగన్ రెండో పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిధుల కొరత గురించి మరియు దిశ చట్టం ఇంకా మూడు రాజధానులు గురించి చర్చించడం జరిగింది. మూడు నెలల తర్వాత జరిగిన ఈ భేటీలో భవిష్యత్తు రాజకీయాల గురించి అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కూడా ఇద్దరు చర్చించకున్నట్లు సమాచారం. ముఖ్యంగా మూడు రాజధానులు అదేవిధంగా అమరావతి ప్రాంతంలో జరిగిన రైతు ధర్నాలు గురించి కూడా చర్చించుకున్నట్లు టాక్.

 

ఇదే సమయంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు విభజన చట్టంలోని అంశాలు గురించి అమిత్ షా దృష్టికి జగన్ సమస్యలు తీసుకు వెళ్లారట. అయితే ఈ సందర్భంలో రాజధాని పేరిట నిధులు విడుదల చేయాలని గతంలో 2500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారని అమిత్ షా కి జగన్ వివరించారు. దీంతో మిగతా పదిహేను వందల కోట్లు విడుదల చేయాలని కోరారు. బాగానే ఉన్నది. అయితే ఏ రాజధానిని ఈ గ్రాండ్ రిలీజ్ చేయాలో కేంద్రానికి తెలియడం లేదు. కేంద్రం వద్దకు ఇంకా మూడు రాజధానుల అంశం చేరలేదు.

 

అఫీషియల్ గా మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు కేంద్రానికి వెళ్ళాలి. కేంద్రం దాన్నిపార్లమెంట్ లో పెట్టి ఒకే చేయాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. అప్పటి వరకు అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది. అయితే ఇప్పుడు జగన్ రాజధాని పేరిట కోరిన నిధులు మూడు రాజధానులు గురించా లేకపోతే అమరావతి గురించా అని జగన్ పై భారీ సెటైర్ కేంద్రంలో ఉన్న పెద్దలు వేస్తున్నారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: