ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి రాజధాని అమరావతి తరలింపును గురించి చర్చ  జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాజధాని ఏర్పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చెప్పినప్పటి నుంచి రాజధాని ప్రాంతంలో రైతులందరూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు చేపడుతున్నారు. అమరావతి ప్రాంతంలో రైతుల తీవ్ర నిరసనలు నేటికి 60 రోజుల చేరుకున్నాయి. అయినప్పటికీ రైతులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి రాజధాని మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అమరావతి రైతులు నిరసన తెలుపుతున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం అమరావతి రైతులకు స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు. 

 

 ఇకపోతే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటన చేశారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని అయితే... అమరావతి రాజధాని అనే నిర్ణయాన్ని గత ప్రభుత్వం హయాంలోనే తీసుకున్నారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజధానిని మార్చే హక్కు  అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదు అంటూ వ్యాఖ్యానించారు. అమరావతి లోని పలు గ్రామాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు చేస్తున్న నిరసనలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ రైతులకు మద్దతు ప్రకటించారు. 

 


 అమరావతి నిర్మించేందుకు గత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు...ఆనాడు  ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కూడా అంగీకారం తెలిపిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణానికి అంగీకారం తెలిపిన వైసిపి పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అమరావతి నుంచి రాజధాని మారుస్తాము అంటున్నారని... అమరావతిని నుండి రాజధాని మరిస్తు  ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతి రైతులందరికీ అండగా ఉంటామని బీజేపీ పెద్దలు కూడా మాటిచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు అందరికీ ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వం అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజధాని రైతులకు మహిళలకు తాను ఎప్పుడూ భరోసాగా ఉంటాను అంటూ హామీ ఇచ్చారు. రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించాలని అనుకున్నామని కానీ ఢిల్లీలో ఎన్నికల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది అంటూ  పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలోనే రైతులకు న్యాయం జరిగే విధంగా ర్యాలీలను నిర్వహిస్తామని అంటూ జనసేన అని తెలిపారు. ఓట్ల కోసం ప్రస్తుతం అమరావతి రైతుల వద్దకు రాలేదని.. రైతులకు భరోసా ఇవ్వడానికి మాత్రమే వచ్చాను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు.

మరింత సమాచారం తెలుసుకోండి: