ప్రేమికుల దినోత్సవం అనగానే ఉండే సందడి అంతా ఇంతా కాదు. ఆ వారం మొత్తం రోజుకి ఒకటి చెప్పున ఏదోక రకంగా ప్రేమికులు ఆ డే ఈ డే అంటూ జరుపుకుని ప్రేమికుల దినోత్సవాన్ని మాత్రం ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.  అయితే ఇప్పుడు ఇదే చాలా ప్రాంతాల్లో పోలీసులకు వరంగా మారింది అంటున్నారు ప్రేమికుల బాధలను దగ్గరగా చూసిన వారు. ప్రియురాలితో, ప్రియుడితో కలిసి కారులో, బైక్ మీద విహరిస్తూ ఉంటారు. పర్యాటక ప్రాంతాలకు, అందమైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల కళ్ళు గప్పి విహరిస్తారు. 

 

ఇప్పుడు ఇదే ప్రేమికులకు చుక్కలు చూపిస్తుంది అంటున్నారు పలువురు. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని ప్రేమికులు పలు ప్రాంతాల్లో ఎంజాయ్ చేసారు. ఈ సందర్భంగా బైక్ ల మీద ప్రేమికులు వివాహరించారు. మోటార్‌ సైకిళ్లు, కార్లు ఇలా రోడ్ల మీద పర్యాటక ప్రాంతాల్లో సందడి వాతావరణ౦ నెలకొంది. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతమైన మహాబలిపురానికి ఉదయం 8 గంటల నుంచి ప్రేమికులు భారీగా తరలి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

 

మహాబలిపురం, చెన్నై మెరీనాబీచ్, బిసెంట్‌నగర్‌ బీచ్, లో ఎండను కూడా లెక్క చేయలేదు. ఇప్పుడు ఇదే పోలీసులకు వరంలా మారింది అంటున్నారు చూసిన వాళ్ళు. చాలా ప్రాంతాల్లో ప్రేమికులను ట్రాఫిక్ పోలీసులు తనిఖీల పేరిట వేధించారు. ప్రేమికుల దగ్గర డబ్బులు వసూలు చేసారు. ఇంత ఇవ్వాలని లేకపోతే స్టేషన్ కి నడవాలని డిమాండ్ చేసారు. దీనితో తాకట్టు పెట్టి కూడా పలువురు పోలీసులకు ప్రేమికులు ముడుపులు ఇచ్చారు. లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, నెంబర్ ప్లేట్ మీద నెంబర్ కనపడటం లేదు అంటూ డబ్బులు వసూలు చేసారు. పాపం ప్రేమికుల దినోత్సవం రోజున   పల్లీలు, గులాబి పువ్వులు కొనుక్కుందామని ప్రేమికులు తెచ్చుకున్న డబ్బులను పోలీసులు లాగేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: