మొన్నటికి మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఘన  విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపి పార్టీలను  సైతం ఓడించి అఖండా  మెజారిటీని సొంతం చేసుకుంది కేజ్రీవాల్ పార్టీ. దీంతో  మూడోసారి హస్తినలో అధికారాన్ని కేజ్రీవాల్ చేపట్టారు. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా పార్టీ అభ్యర్థులందరూ మహిళా నేతల సంబంధిత అంశాల పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఎన్నికల్లో ఎక్కువగా మహిళలు ఆకర్షించడం పైన దృష్టి పెట్టిన ఆప్  పార్టీ... ఎన్నికల్లో భారీ మెజారిటీతో సొంతం చేసుకుని అఖండ  విజయాన్ని సాధించింది. బిజెపి ఎన్ని వ్యూహాలు వేసినప్పటికీ ఆప్  పార్టీ ముందు మాత్రం ముందు మాత్రం అది నిలబడలేకపోయాయి. ఇక ఆప్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా మహిళలు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు.

 


 ఇక ఇప్పుడు... ఆమ్ ఆద్మీ పార్టీ తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో మహిళలపై ఎక్కువ దృష్టిపెట్టి మహిళలు ఆకర్షించే ప్రయత్నం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు మాత్రం ... వాళ్లను పట్టించుకోవడంలేదని ఢిల్లీ మహిళలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అది దీనికి కారణం కూడా లేకపోలేదు కేజ్రీవాల్ క్యాబినెట్ లో ఒక మహిళకు కూడా ప్రాధాన్యం కల్పించకపోవడం పైన మహిళలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో మహిళలు ఓట్ల  పైనే ఎక్కువ దృష్టి పెట్టిన కేజ్రీవాల్ సర్కారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక్క మహిళకు  కూడా స్థానం కల్పించకపోవడంతో... అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 అటు  సోషల్ మీడియా వేదికగా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ క్యాబినెట్ లో మహిళలకు స్థానం కల్పించకపోవడం పై తప్పుబడుతున్నారు నెటిజన్లు. మొత్తం ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను గెలుచుకుంది ఈ అరవై రెండు స్థానాల్లో  ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు గెలుపొందారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆకర్షించి మహిళల చేత ఓట్లు వేయించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు ఆ పార్టీ నేతలు... ఇప్పుడు మాత్రం మహిళలను ఎందుకు క్యాబినెట్లో తీసుకోవడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడవసారి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సెట్టింగ్ మంత్రులకు తిరిగి మళ్ళీ కేబినెట్లో స్థానం కల్పించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: