దేశంలో జాతీయ పౌరసత్వ సవరణ గురించి తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నార్సీని అన్ని వర్గాలు దాదాపుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా హిందుత్వ ఓటు బ్యాంకు ని పెంచుకోవడానికి బిజెపి ఈ విధంగా వ్యూహాలను సిద్దం చేసి నూతన చట్టాలను తీసుకొస్తుందని పలువురు మండిపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

 

ముస్లీం మైనార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ భవిష్యత్తుని కేంద్రం ప్రశ్నార్ధకం చేసిందని మండిపడుతున్నాయి. ఇక ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎం చేస్తుంది అనే ప్రశ్న వినపడుతుంది. ఈ నేపధ్యంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి అంజాద్ భాషా సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రం ఈ విషయంలో ముందుకి వెళ్తే తాను రాజీనామా చేస్తా అని హెచ్చరించారు. వైసీపీ ఎన్డియేలో చేరుతుంది అని ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో దీనిపై స్పందించిన ఆయన పదవిని వదులుకోవడానికి సిద్దమని చెప్పారు. 

 

ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. తనకు పదవులు కాదన్న ఆయన... నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఎన్‌ఆర్‌సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకైనా సిద్ధమని ఈ సందర్భంగా ప్రకటించారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎంను ఒప్పిస్తా అన్నారు మంత్రి. ఎన్డీయేలో చేరుతామని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మా ప్రభుత్వం ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. 151 సీట్లు గెలిచామన్న మంత్రి, ఎందుకు ఎన్డీయేలో కలుస్తామని ప్రశ్నించారు. బిజెపితో భవిష్యత్తులో కూడా కలిసేది లేదని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: