జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ సందర్భంగా విమర్శలు చేసారు. కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులు ఒక మాట రాష్ట్ర౦లో బిజెపి నాయకులు మరో మాట మాట్లాడుతున్నారని పవన్ ఆరోపించారు. దీనితో రెండు అర్ధాలు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గుంటూరు జిల్లా అనంతవరంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలోని అమరావతి రైతులకు మద్దతుగా పర్యటన చేసారు. 

 

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి టీడీపీ నేతల మీద కోపం ఉంటే వారి మీద తీర్చుకోవాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఆయన కోరారు. పోలీసులను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. భారీ మెజారిటీతో అధికారం ఇస్తే ప్రజలను రోడ్ల మీదకు ఈడ్చారు అంటూ పవన్ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని బిజెపి నేతలకు తాను స్పష్టంగా చెప్పా అని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం, మూడు రాజధానులకు కేంద్రం ఏ విధంగా కూడా మద్దతు ఇవ్వలేదని పవన్ స్పష్టం చేసారు. 

 

వాళ్ళు అసలు దీనికి అనుకూలం కాదని అన్నారు. ప్రధాని వేరు, బిజెపి వేరు అని అన్నారు. వైసీపీ నాయకులు చెప్తున్నట్టు గా కేంద్రం మద్దతు ఇవ్వలేదని, ఇది ఇప్పటికే నిర్ణయించిన అంశం కాబట్టి దాంట్లో వాళ్ళు జోక్యం చేసుకునే అవకాశం లేదని అన్నారు. అది రాష్ట్ర పరిధిలోని అంశమని అన్నారు ఆయన. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో జోక్యం చేసుకుంటుంది అన్నారు. కేంద్రానికి పరిమితులు ఉంటాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటాయని, ఆ అధికారం వాళ్లకు ఉందని, కాబట్టి ఈ విషయంలో రాజకీయ పోరాటమే మార్గం గాని మరొకటి లేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: