రాజకీయ నాయకులకు ఎంతోమంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది తమ పాలన నచ్చి అభిమానులు అయితే.. ఇంకొంత మంది నాయకుల అజెండాను చూసి అభిమానులు అవుతారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వచ్చింది అంటే.. టిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతాయి అనే విషయం తెలిసిందే. కెసిఆర్ అభిమానులు కూడా తమ అభిమాన నేత ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు నాడు ఎంతో ఘనంగా  సెలబ్రేట్ చేసుకుంటారు. 

 


 కాగా ఈ నెల 17వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే టిఆర్ఎస్ శ్రేణులు అందరూ సంబరాలకు సిద్ధమైపోయినా విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ నేతలు ఎలాంటి సంబరాలు చేసుకోవద్దని.... మీ అభిమాన నేత అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నాడు మొక్కలు నాటి  అందరికీ ఆదర్శంగా నిలవాలి అంటూ కేసిఆర్ వారసుడు... ఐటీ  శాఖ మంత్రి కేటీఆర్ కార్యకర్తలందరికీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున మొక్కలు నాటేందుకు  టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా సిద్ధమై పోయారు. 

 


 ఇకపోతే అభిమానులు తమ అభిమాన నేతల పై ఉన్న అభిమానాన్ని కాస్త కొత్తగా చాటుకోవడానికి ప్రయత్నిస్తారు అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ ఒక బార్బర్ కెసిఆర్ పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా  చాటాడు. ఈనెల 17వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా... ఇక్కడ ఒక అభిమాని వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నాడు తన సెలున్ కి  వచ్చే ప్రతి ఒక్కరికి ఉచితంగా  కటింగ్ షేవింగ్ చేస్తానంటూ ప్రకటించాడు ఇక్కడ ఒక బార్బార్. ఈ మేరకు ఒక బ్యానర్  కూడా ఏర్పాటు చేశారు. కాగా ప్రస్తుతం ఈ బ్యానర్ సోషల్ మీడియాలో మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: