రాజకీయాల్లో ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఈరోజు ఆ పార్టీ ప్రత్యర్థి అతనే అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆ ప్రత్యర్థిని అదే పార్టీ కండువా కప్పి మరి పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఇప్పుడు ఈ విధంగానే ఢిల్లీలో రాజకీయాలు జరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీకి ఇటీవల వరుస పెట్టి ఓటములు ఎదురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యతిరేకతను మొక్కగా ఉన్నప్పుడే బిజెపి కట్ చేయాలని అనుకుంటున్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది. విషయంలోకి వెళితే ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ని ఎన్‌డి‌ఏ లోకి మోడీ ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి.

 

ముఖ్యంగా రాబోయే రోజుల్లో రాజ్యసభలో ఎన్‌డి‌ఏ కి బలం తగ్గిపోయే అవకాశం ఉండటంతో ప్రాంతీయ పార్టీలను తన వైపు లాక్కోవటని కి మోడీ ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు జాతీయ మీడియా వర్గాల్లో టాక్. ఇందుమూలంగా సౌత్ లో మోడీ కన్ను స్టాలిన్ మీద అదేవిధంగా దేశంలోనే అతి తక్కువ కాలంలోనే మంచి ముఖ్యమంత్రిగా రోజురోజుకీ మరింత పేరు తెచ్చుకుంటున్న జగన్ పైన పడిందట. ఇటువంటి నేపథ్యంలో ఎన్‌డి‌ఏ లోకి రావాలని జగన్ ని కోరారట. అంతేకాకుండా రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారట.

 

అయితే జగన్ మాత్రం విభజన హామీలను అదేవిధంగా నిధుల విషయంలో సమయానికల్లా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాడట. అంతే కాకుండా ప్రత్యేక హోదా విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా క్లారిటీ ఇవ్వాలని..అది న్యాయబద్ధంగా రాష్ట్రానికి అతి ప్రాముఖ్యమైన హామీ అని జగన్ మోడీ దృష్టికి తీసుకు వెళ్లారట. ప్రత్యేక హోదా విషయంలో క్లారిటీ ఇస్తేనే ఎన్‌డి‌ఏ లోకి రావటం గ్యారెంటీ అని జగన్..మోడీకి సూచించినట్లు సమాచారం. మరి జగన్ డిమాండ్ చేసిన విషయాలను మోడీ పరిగణలోకి తీసుకుంటారో..లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: