టీడీపీని వీడి బీజేపీతో జత కట్టిన పవన్‌ కళ్యాణ్ పరిస్థితి ఇప్పుడు మరోసారి అయోమయంలో పడింది. రాష్ట్ర బీజేపీ జనసేనతో కలిసి నడుస్తుంటే జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ పెద్దలు మాత్రం వైసీపీ పార్టీకి రెడ్‌ కార్పెట్‌ వేస్తోంది. దీంతో జనసేన వర్గాల్లో అయోమయం నెలకొంది. అసలు బీజేపీలో తన బంధం ఏంటి..? ఎంతకాలం కొనసాగుతుంది అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. అధికారికంగా జనసేన, బీజేపీలు కలిసి పనిచేస్తున్నట్టుగా ప్రకటించినా ఇంతవరకు ఈ రెండు పార్టీలు కలిసి ఒక్క కార్యచరణ కూడా చేపట్టలేదు.



ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు క్షణ క్షణానికి మారిపోతున్నాయి. మూడు రాజధానులు, మండలి రద్ధు లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న వైసీపీ ప్రభుత్వం అందుకు కేంద్ర మద్ధతు కోరుతూ బీజేపీ పెద్దలను కలుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీతో పాటు అమిత్‌ షా, ఇతర పార్టీ పెద్దలను కూడా కలిసి జగన్‌ రాష్ట్ర పరిస్థితులను వివరించి తన నిర్ణయాలకు కావాల్సిన మద్దుతు కూడగడుతున్నాడు.



ఇప్పటిక వరకు అందుతున్న వార్తల ప్రకారం బీజేపీ అధిష్టానం కూడా జగన్‌ నిర్ణయాలపై సానుకూలంగానే స్పందించనట్టుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో జనసేన వర్గాల్లో కలవరం మొదలైంది. జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని జనసేనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు కానీ అనూహ్యం జగన్‌ కేంద్ర నుంచి మద్ధతు లభించటంతో ఇప్పుడు రాష్ట్ర నాయకులు అయోమయంలో పడిపోయారు

.

ఈ సమయంలో జనసేన కూడా బీజేపీతో కలిసి నడుస్తుందా..? లేక తిరిగి ఒంటరి పోరటమే బెటర్‌ అని భావిస్తుందా? అన్న అనుమానులు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొంతమంది జనసైనికులు బీజేపీ తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుండటంతో జనసేన, బీజేపీల దోస్తీ త్వరలోనే ముగుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీలో, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.



ఢిల్లీ ఎన్నికలో ఘోర పరాభవం తరువాత బీజేపీ కూడా భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం పడవచ్చని భావిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే ఎంపీల పరంగా సంఖ్య బలం ఉన్న పార్టీలతో సఖ్యత కోసం ఎదురు చూస్తోంది.  వైసీపీ కూడా అంశాల వారిగా బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ పరిస్థితి ఆటలో అరటిపండులా అయిపోయిందని మదన పడిపోతున్నారు జనసైనికులు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: