ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి జగన్ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం జగన్ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు జారీ చేసింది. 
 
వైసీపీ ప్రభుత్వం విశాఖతో పాటు తిరుపతిలో కూడా లైట్ మెట్రో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి తిరుమల మార్గంలో రద్దీ నియంత్రణ కోసం లైట్ మెట్రో రవాణా విధానానికి ప్రతిపాదనలను రూపొందించింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎంవీఎస్ రెడ్డితో భేటీ అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎంవీఎస్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 
 
వైవీ సుబ్బారెడ్డి ఎంవీఎస్ రెడ్డితో తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ తగ్గించటానికి చేపట్టాల్సిన అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించటంతో పాటు రేణిగుంట విమానశ్రయం నుండి తిరుపతి వరకు రవాణా సౌకర్యం గురించి, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్ నుండి శ్రీవారి మెట్టు వరకు రవాణా మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. మెట్రో రైల్ ఎండీ ఎంవీఎస్ రెడ్డి విదేశాల్లో ఉన్న లైట్ మెట్రో రవాణా వ్యవస్థ బాగుంటుందని వైవీ సుబ్బారెడ్డికి సూచనలు చేశారు. 
 
టీటీడీ ప్రస్తుతం మెట్రో రైల్ ప్రాజెక్టు అంచనాలు, వ్యయంకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఛైర్మన్ అంచనాలతో కూడిన పూర్తి నివేదికను టీటీడీ ఇచ్చిన తరువాత అమలు చేసే దిశగా సీఎం జగన్ తో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. లైట్ మెట్రోకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే తెరపైకి రానున్నట్టు తెలుస్తోంది.           

మరింత సమాచారం తెలుసుకోండి: