స్టార్టింగ్ లో వరుస పెట్టి విజయాలు వరించాయి విజయ్ దేవరకొండ కి. ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయితే మొదటి లో సినిమాలు వరుసగా హిట్ అయిన సందర్భంలో సినిమా ప్రమోషన్ సమయంలో రెచ్చిపోయి స్పీచ్ లు ఇచ్చిన విజయ్ దేవరకొండ ని సోషల్ మీడియాలో భయంకరంగా టార్గెట్ చేశారు. సినిమాలు ఫ్లాప్ అయితే చాలు భయంకరమైన ట్రోలింగ్ విజయ్ దేవరకొండ పై జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల విజయ్ దేవరకొండ మొట్ట మొదటిసారి నలుగురు హీరోయిన్లతో కలసి నటించడం జరిగింది. 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా భయంకరమైన అట్టర్ ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ నిరుత్సాహం చెందారు.

 

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇటు అభిమానుల లోనూ అటు ఇండస్ట్రీలోనూ రిలీజ్ అవ్వకముందు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజయ్యాక భయంకరమైన ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవరకొండ మళ్లీ హిట్ ఎప్పుడు కొడతాడో అని తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు. ఇదిలా ఉండగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రమోషన్ టైం లో ఇంకా లవ్ స్టోరీ సినిమాలు నేను చేయను ఇదే నా చివరి లవ్ స్టోరీ అని విజయ్ దేవరకొండ స్పీచ్ ఇచ్చారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ కి కథలు చెప్పే దర్శకులు అంతా అర్జున్ రెడ్డి సినిమా తరహాలో కథలు రాసుకుంటూ వచ్చి విజయ్ దేవరకొండ నీ గడ్డం పెంచేటట్టు చేసి అట్టర్ ఫ్లాప్ లు ఇస్తున్నారు.

 

దీంతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టాలంటే త‌న‌కు క‌థ‌లు చెప్పే ద‌ర్శ‌కులంతా 'అర్జున్‌రెడ్డి' హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట‌కు రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన విధానం అసలు బాగోలేదు స్టోరీలో స్టోరీ ఉండటం పైగా సెకండాఫ్ పూర్తిగా డాళ్ కావటంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని ఫ్యాన్స్ డైరెక్టర్ ని తెగ తిడుతున్నారు. మొత్తం మీద విజయ్ దేవరకొండ మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టాలంటే ఆయన దగ్గరకు వచ్చే డైరెక్టర్లు అర్జున్‌రెడ్డి హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట‌కు రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: