అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఆడే డ్రామాల గురించి అందరికి తెలిసిందే. ఎప్పుడు ఏదోక విషయంలో తల దూర్చే పాకిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో అనుసరించే వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉగ్రవాదులను అన్ని విధాలుగా పెంచి పోషిస్తూ పాకిస్థాన్ ప్రపంచం ముందు దోషిగా నిలబడినా సరే ఆ దేశం బుద్ధి మాత్రం మారడం లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. భారత్ మీద కక్ష సాధింపు వైఖరితో వ్యవహరించే పాకిస్తాన్ ఇప్పుడు కూడా ఉగ్రవాదులకు ఆర్ధికంగా అండదండలు అందిస్తుంది. ఇక బ్యాట్ దళాలు అంటే బోర్డర్ యాక్షన్ టీం ని పెంచి పోషించింది. 

 

ఆ టీం ఉగ్రవాదులు ఆర్మీ అధికారుల కలయికతో ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ విషయంలో పాకిస్తాన్ ధోరణిపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. అయినా సరే ఆ దేశం మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఇక తాజాగా ఇక ఫైనాన్షీయల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్) వారి ఒత్తిడి తీవ్రమవడంతో ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్‌కు జైలు శిక్ష వేసింది పాకిస్తాన్. ఆ దేశంలో అతనికి ఉన్న స్వేచ్చ సామాన్య పౌరుడికి కూడా ఉండదు అనేది అందరికి తెలిసిందే. అయితే ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోతే మాత్రం, బ్లాక్ లిస్టు లో పెడతామని హెచ్చరించడంతో అతన్ని అరెస్ట్ చేసింది పాకిస్థాన. 

 

అంతర్జాతీయ ఉగ్రవాదికి కేవలం, 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాని అతను బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బ్లాక్‌లిస్ట్‌లో పాక్‌ను పెట్టబోమని... ఎఫ్‌ఏటీఎఫ్ నిర్ణయం తీసుకున్న అనంతరం అతన్ని విడుదల చేయడానికి పాకిస్తాన్ సిద్దమైంది. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న లొసుగలను వాడుకుని అతను విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అతని శిక్షపై కోర్ట్ లో అప్పీల్ చేస్తామని కూడా అతని లాయర్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఒత్తిడి చేయడం మినహా అతన్ని జైల్లో పెట్టడానికి ఏ కారణం లేదని న్యాయవాదులు వాదించే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: